జగన్ పై వెల్లువెత్తిన అభిమానం

Sun Dec 15 2019 15:14:41 GMT+0530 (IST)

Palabhishekam For YS Jagan In Andhra

ఏపీలోని మహిళలకు అన్నగా మారి.. వారి రక్షణ కోసం ‘దిశ చట్టం’ ఆమోదింపచేసిన సీఎం జగన్ పై ఆంధ్రా ఆడకూతుళ్ల నుంచి ప్రశంసలు వర్షం కురుస్తోంది. తాజాగా విజయవాడలో జగన్ చిత్రపటాలపై మహిళలు పెద్ద ఎత్తున పాలు పోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటంపై మహిళలు క్షీరాభిషేకాలు చేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ తెచ్చిన దిశ చట్టం దేశానికే ఆదర్శమన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వేధించారని.. మహిళల భద్రత కోసం చట్టం చేసిన జగన్ కు రుణపడి ఉంటానని దేవినేపి తెలిపారు.

ఇక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కూడా మహిళలు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. దిశ చట్టం ఆమోదింప చేసినందుకు స్వీట్లు పంచుకొని జగన్ కు జయజయనాదాలు చేశారు.