Begin typing your search above and press return to search.

భారత్ ను కవ్విస్తున్న పాక్ ప్రధాని.. పక్కదారి పట్టించేందుకేనా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 2:14 PM GMT
భారత్ ను కవ్విస్తున్న పాక్ ప్రధాని.. పక్కదారి పట్టించేందుకేనా?
X
పాకిస్తాన్ దివాళా తీయడానికి రెడీ ఉంది. శ్రీలంక మాదిరిగా పాక్ పరిస్థితి తయారు కావడానికి ఎంతో సమయం పట్టే అవకాశం లేదు. ఆర్థిక మాంద్యం.. నిత్యావసర ధరల పెరుగుదల.. ఉగ్రవాదం.. అనిశ్చితి రాజకీయాలు వంటి సమస్యలు పాకిస్థాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ దేశాన్ని చక్కబెట్టుకోవాలని చూస్తారు.

కానీ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్ తో కయ్యానికి సిద్ధమవుతున్నాడు. గత నెలలో భారత్ తో శాంతి కోసం చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టాడు. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా ఆయన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఇటీవల పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన భారత్ పై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. భారత్ తమపై డేగ కన్ను వేస్తే.. అణ్వాయుధాలు కలిగిన మేము ఆ దేశాన్ని మా పాదాల కింద నలిపి వేయగలమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కశ్మీర్ కు రాజకీయ.. దౌత్య.. నౌతిక సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

షెహబాజ్ భారత్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటంతో సొంత పార్టీ నేతలే సైతం ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా భారత్ ను కవ్వించేలా వ్యాఖ్యలు చేయడం మంచి కాదని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక.. ఆహార సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని సూచిస్తున్నారు. ముందు సొంత ఇంటిని చక్కబెట్టాలని హితవు పలుకుతున్నారు.

సరిహద్దు దేశాలతో సఖ్యత ఉంటేనే ప్రస్తుత పరిస్థితి నుంచి పాకిస్థాన్ బయటపడుతుందని పాక్ ప్రధానికి సూచిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ను కవ్విస్తే అధికంగా నష్టపోయేది మనమేనని హితవు పలుకుతున్నారు.

అయితే పాక్ లో పరిస్థితిని చక్కదిద్దలేక పోతున్న తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ దేశ ప్రధాని ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.