దుబాయిలో ఇండియన్ ను చంపిన పాకిస్తానీ

Tue Feb 12 2019 14:20:34 GMT+0530 (IST)

Pakistani Man Gets 7 Year Jail For Killing Indian Worker In Dubai

పొట్ట కూటి కోసం దుబాయికి వెళ్లిన ఇండియన్ కూలీని అక్కడ పాకిస్తానీ కూలీ కత్తితో పొడిచి చంపాడు. కేసు నమోదు చేసిన దుబాయి పోలీసులు ఆ పాకిస్తానీకి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించడం జరిగింది. శిక్షా కాలం పూర్తి అయిన వెంటనే అతడిని దుబాయి నుండి పాకిస్తాన్ కు పంపించాలని కూడా తీర్పు వచ్చింది. వీరిద్దరి మద్య గొడవకు కారణం చిన్నదే అయినా కూడా పాకిస్తానీ క్షణికావేశంలో ఇండియన్ ను చంపేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే... దుబాయిలోని జిబెల్లె ప్రాంతంలో ఒక కంపెనీలో కార్మికుడిగా ఇండియకు చెందిన వ్యక్తి పని చేస్తున్నాడు. అదే కంపెనీకి చెందిన ప్లాట్ లో మరి కొంత మందితో కలిసి ఉంటున్నాడు. అదే ప్లాట్ లో పాకిస్తాన్ కు చెందిన కూలీ కూడా ఉంటున్నాడు. ఇద్దరు కలిసి ఒకే కంపెనీలో పని చేస్తూ కొంత కాలంగా ఒకే ప్లాట్ లో ఉంటున్నారు. అయితే తాజాగా ఇండియన్ రాత్రి సమయంలో డ్యూటీ పూర్తి చేసుకుని ఫ్లాట్ కు వెళ్లాడు. అప్పటికే లైట్ ఆఫ్ చేసుకుని ఉన్న పాకిస్తానీ నిద్రపోయాడు. ఇండియన్ వెళ్లి లైట్ వేయడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడట.

ఎప్పుడుపడితే అప్పుడు లైట్ వేయడం ఏంటీ అంటూ ఇండియన్ పై పాకిస్తానీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇండియన్ వెళ్లి సూపర్ వైజర్ కు ఫిర్యాదు ఇచ్చాడు. విజిటింగ్ వీసాపై వచ్చిన పాకిస్తానీ కంపెనీలో కూలీ పని చేసుకుంటున్నాడు. కంపెనీ వీసా లేకుండానే మా ఫ్లాట్ లో ఉంటూ మాపై పెత్తనం చెలాయించేందుకు చూస్తున్నాడు అంటూ సూపర్ వైజర్ కు ఇండియన్ ఫిర్యాదు చేశాడట. దాంతో సూపర్ వైజర్ సదరు పాకిస్తానీని ప్లాట్ నుండి పంపించాడు. దాంతో ఇండియన్ పై కక్ష పెంచుకున్న పాకిస్తానీ రెండు రోజుల తర్వాత ప్లాట్ కు వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. కంపెనీ వారు ఇచ్చిన ఫిర్యాదుతో పాకిస్తానీ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో హత్య నిరూపితం అవ్వడంతో ఏడు ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది.