Begin typing your search above and press return to search.

నువ్వు ఆడపిల్లవి .. డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వలేనమ్మా !

By:  Tupaki Desk   |   21 Sep 2020 10:10 AM GMT
నువ్వు ఆడపిల్లవి ..  డ్రైవింగ్‌ లైసెన్సు ఇవ్వలేనమ్మా !
X
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సొంత వాహనాలు ఉన్నాయి. చాలామంది సొంత వాహనాల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో అలా అనుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో వాహనాల అమ్మకాల్లో కూడా వేగం పుంజుకుంది. ఇక వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ లేకుండా బండి బయటకి తీస్తే .. ఆర్టీఏ అధికారులు వేసే జరిమానాలతో మరో వాహనం కొనుక్కోవచ్చు. ఇక ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్ కి పొతే , అక్కడ వారు పెట్టె పాట్లు , చెప్పే సాకులు అన్ని ఇన్ని కావు. కొందరు ఆర్టీఏ అధికారులు లైసెన్స్ కోసం పెట్టే టెస్ట్ పాస్ అయినా కూడా లైసెన్స్ ఎవ్వరు. అదేంటి టెస్ట్ పాస్ అయ్యాం కదా ఎందుకు ఇవ్వరు అంటే ..దానికి సవాలక్ష కారణాలు చెప్తారు. ఈ తరహా ఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి.

తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ అమ్మాయి కూడా ఇదే అనుభవం. ఆ అమ్మాయి పేరు శిరీన్‌. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లింది. రిటర్న్‌ టెస్ట్‌ పాస్‌ అయింది. బండి మీద 8 కొట్టింది. ఆఫీసర్‌ ఆమెకి అభినందించారు. ఆ తర్వాత వెంటనే ‘సారీ అమ్మా, అమ్మాయిలకు డ్రైవింగ్‌ లైసెన్సును నేనైతే ఇవ్వలేను‘ అన్నాడు. ‘ఇవ్వాల్సింది మీరే కదా సర్‌’ అని అడిగింది. ‘అయిననూ ఇవ్వలేనమ్మా.. ఆడపిల్లలు బండ్లు పడేస్తారు’ అన్నాడు. ‘డబ్బుల కోసమా సర్‌ ’ అంటే.. ‘కాదమ్మా.. నీకు దెబ్బలు తగులుతాయని’ అన్నాడు. శిరీన్‌కి కోపం వచ్చింది. ట్విట్టర్‌లోకి వెళ్లి ‘ఏం రూల్‌ ఇది?’ అని నేరుగా ప్రైమ్‌ మినిస్టర్‌ ఇమ్రాన్‌ ఖాన్ ‌కి ట్విట్టర్ ‌ ద్వారా విన్నపించుకుంది. దీనితో వెంటనే ఆర్టీఏ ఆఫీసర్ ఇమ్రాన్‌ లైన్‌ లోకి వచ్చారు. 'వచ్చి లైసెన్స్‌ తీసుకెళ్లమ్మా..’ అని ఫోన్‌ చేశాడు. వెళ్లి లైసెన్స్‌ తెచ్చుకుని.. ‘థ్యాంక్యూ మిస్టర్‌ ఇమ్రాన్‌’ అంటూ ప్రధానికి ట్వీట్‌ చేసింది. ట్విట్టర్‌ వచ్చాక దేశ ప్రధానులు తప్ప ఎవరూ అందుబాటులో ఉండటం లేదు.