Begin typing your search above and press return to search.

ఇండోనేషియా ఓపెన్ : క్వార్టర్ కి దూసుకెళ్లిన సింధు

By:  Tupaki Desk   |   25 Nov 2021 11:30 AM GMT
ఇండోనేషియా ఓపెన్ : క్వార్టర్ కి దూసుకెళ్లిన సింధు
X
ఇండోనేషియా ఓపెన్లో భాగంగా ఈ రోజు జరిగిన పోరులో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీ ప్లేయర్ వొన్ని లిపై 21-12, 21-18 తేడాతో విజయం సాధించింది. 37 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్.

అంతకుముందు బుధవారం జరిగిన మ్యాచ్లో జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిపై 17-21, 21-17, 21-17 తేడాతో గెలిచింది. టోర్నీలో మూడోసీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీకి చెందిన బాలిలో వైవోన్ లీని 21-12, 21-18తో వరుస సెట్లలో ఓడించింది.

రెండుసార్లు ఒలింపిక్‌ విజేత అయిన సింధు వైవోన్‌ లీని కేవలం 37 నిమిషాల్లోనే మట్టికరిపించి క్వార్టర్స్‌ కు చేరుకుంది. ఇక క్వార్టర్స్‌ లో స్పెయిన్‌ కు చెందిన 55వ సీడ్‌ బీట్రిజ్ కొర్రల్స్, కొరియాకు చెందిన 54వ సీడ్‌ సిమ్‌ యుజిన్‌ మధ్య విజేతతో తలపడనుంది.

ఈ రోజే భారత ప్లేయర్లు సాయిప్రణీత్.. ఫ్రెంచ్ ప్లేయర్ క్రిస్ట్రో తలపడనుండగా.. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం. దక్షిణకొరియా ఆటగాళ్లు కంగ్-సియోతో పోటీ పడనున్నారు.

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీపడనుంది. ఈ ఎన్నికలు స్పెయిన్‌ లో డిసెంబరు 17న జరుగుతాయి. అథ్లెట్స్‌ కమిషన్‌లో ఆరు స్థానాలు ఉండగా 9 మంది క్రీడాకారుల్ని పోటీపడనున్నారు. అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యులు 2021 నుంచి 2025 వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుతం అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలిగా ఉన్న సింధు మరోసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. 2017లో తొలిసారిగా సింధు అథ్లెట్స్‌ కమిషన్‌ కు ఎంపికైంది. ప్రస్తుత అథ్లెట్స్‌ కమిషన్‌ నుంచి సింధు ఒక్కరే మరోసారి ఎన్నికల్లో బరిలో దిగుతుంది.