మోడీ రివర్స్ అటాక్..రాహుల్ అలర్ట్ అవ్వాల్సిందే

Tue Jan 22 2019 18:29:26 GMT+0530 (IST)

PM Narendra Modi uses 15 paise remark of Rajiv Gandhi to attack Congress at Pravasi Bharatiya Diwas

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనపై ఎదురుదాడి చేస్తున్న వారిని అదే రీతిలో టార్గెట్ చేసేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా - వారణాసిలో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ ఈవెంట్ లో ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఢిల్లీలో రూపాయి బయలుదేరితే.. అట్టడుగుకు చేరేసరికి 15 పైసలు మాత్రమే మిగులుతున్నదని ఒకప్పుడు రాజీవ్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మిగతా 85 పైసలు మాయమైపోతున్నాయని ఆయన చెప్పారు. నేరుగా రాజీవ్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజ్ ను ఆపడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చెప్పిన అవినీతి మోడల్ నే ఉదహరిస్తూ కాంగ్రెస్ పై మోడీ విరుచుకుపడ్డారు. ``మాజీ ప్రధాని ఒకరు అవినీతి గురించి చెప్పడం మీరు వినే ఉంటారు. ఢిల్లీ నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే సగటు మనిషికి చేరుతోంది. మిగతా 85 పైసలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీ దీనిని పట్టించుకోలేదు`` అని మోడీ అన్నారు. కాంగ్రెస్ హయాలో జరిగిన ఈ 85 శాతం దోపిడీని టెక్నాలజీ సాయంతో తమ హయాంలో పూర్తిగా ఆపేశామని మోడీ స్పష్టం చేశారు. ``మేము ప్రజలకు రూ.5 లక్షల 80 వేల కోట్లు ఇచ్చాం. వివిధ పథకాల కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లలోకే నేరుగా పంపించాం. పాత పద్ధతి ప్రకారమే మేము కూడా వ్యవహరించి ఉంటే సుమారు రూ.4.5 లక్షల కోట్లు మాయమైపోయేవి`` అని మోడీ అన్నారు.