మోడీ పర్యటనకు రూ.30 కోట్ల ఖర్చు.. పరిహారం ఇచ్చింది 5 కోట్లు

Fri Dec 02 2022 18:05:07 GMT+0530 (India Standard Time)

PM Modi trip to Morbi for few hours cost Rs 30 crore

ప్రధాని మోడీ రూపాయి బాధితులకు ఇవ్వడానికి ధైర్యం రాదనే ప్రచారం ఉంది. ఆయన దేశం కోసం చనిపోయిన సైనికులకు కూడా పెద్దగా పరిహారం ప్రకటించరు. కానీ ఆయన ప్రచారాలకు.. సొంత డబ్బా కొట్టుకునేందుకు మాత్రం తెగ ఖర్చు చేస్తారనే పేరుంది.ఇటీవల గుజరాత్ లో బిడ్జి కుప్పకూలి మరణించిన వారిని పరామర్శించేందుకు వచ్చిన మోడీ టూర్ ఖర్చు అక్షరాల 30 కోట్లు. బాధితులకు ఇచ్చింది ఎంతో తెలుసా? ఒక్కో కుటుంబానికి కేవలం 4 లక్షలు మాత్రమే. ఇది ఆర్టీఐ ద్వారా అడగగా వివరాలు తెలిసాయి. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

గుజరాత్ బ్రిడ్జి దుర్ఘటన తర్వాత అక్టోబర్ 30న గుజరాత్‌లోని మోర్బీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రూ.30 కోట్లకు పైగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందట... ఇది తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా వెల్లడైన నిజం.  135 మంది బాధితుల బంధువులకు ఇవ్వబడిన ఎక్స్ గ్రేషియా కేవలం 5 కోట్లు మాత్రమే. అదీ కుటుంబానికి 4 లక్షలే కావడం గమనార్హం. మోడీకి చేసిన ఖర్చును బాధితులకు ఇస్తే వారి దు: ఖం అయినా తగ్గేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గుజరాతీ మీడియాలో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్‌ల చిత్రాలను షేర్ చేస్తూ సాకేత్ గోఖలే ట్వీట్ చేస్తూ మోర్బీలో మోదీ కొన్ని గంటలపాటు పర్యటించడానికి రూ.30 కోట్లు ఖర్చయిందని ఆర్టీఐ ప్రతిస్పందన వెల్లడించింది. ”ఇందులో రూ.5.5 కోట్లు పూర్తిగా స్వాగత ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ఫోటోగ్రఫీ కోసం మాత్రమే. చనిపోయిన 135 మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అంటే రూ.5 కోట్లు. కేవలం మోదీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ & పీఆర్‌లకే 135 మంది జీవితాల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది’’ అని ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ చేసిన సెంటర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క నిజ-తనిఖీ విభాగం ఈ అభియోగాన్ని ఖండించింది. క్లెయిమ్ నకిలీదని పేర్కొంది. అలాంటి RTI నివేదిక లేదని పేర్కొంది.

“ఆర్టీఐని ఉటంకిస్తూ మోర్బిలో ప్రధాని పర్యటనకు రూ.30 కోట్లు ఖర్చయిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాంటి ఆర్టీఐ స్పందన ఏదీ ఇవ్వలేదు’’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం ట్వీట్ చేసింది. దీంతో ఇందులో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.