Begin typing your search above and press return to search.

మోడీనే డైరెక్టు చేసిన ఘనత కేసీఆర్ ఖాతాలోకి..

By:  Tupaki Desk   |   9 April 2020 6:00 AM GMT
మోడీనే డైరెక్టు చేసిన ఘనత కేసీఆర్ ఖాతాలోకి..
X
సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. దాన్ని సమర్థవంతంగా బయటకు చెప్పటం అంతతేలికైన విషయం కాదు. ఇలాంటి ఇబ్బందికర టాస్కుల్ని అద్భుతంగా డీల్ చేసే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. కరోనాను దేశ ప్రజలు సీరియస్ గా తీసుకున్నా.. దాని కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో విపరీతమైన ఫస్ట్రేషన్ లో ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికి అత్యధికులకు కరోనా అన్నది మాయదారి వైరస్ కంటే కూడా.. తమ కెరీర్ కు.. తమ స్వేచ్ఛను కంట్రోల్ చేసినదిగా భావించటమే.

కరోనా కారణంగా ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని.. దానికి దూరంగా ఉండాలన్న ఆలోచన కంటే.. తమకేం కాదు.. తామంతా సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అయ్యే వారే ఎక్కువని చెప్పాలి. ఈ కారణంతోనే లాక్ డౌన్ ముగింపు కోసం కళ్లను పత్తి కాయల మాదిరి చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడో లాక్ డౌన్ గడువు ముగుస్తుందో చూసుకొని.. బయటకు వచ్చేయాలన్న ప్లాన్ లో పెద్ద ఎత్తున ఉన్నారు. ఇలాంటివేళ.. లాక్ డౌన్ పొడిగింపు మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లుగా చెప్పేయటమే కాదు.. కరోనా విషయంలో మరెంత కఠినంగా ఉండాలన్న విషయాన్ని తన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు కేసీఆర్.

కరోనాను కంట్రోల్ చేయటానికి దేశం ముందున్న ఏకైక అప్షన్ లాక్ డౌన్ ను పొడిగించటం మినహా మరేమీ లేదన్న కఠిన వాస్తవాన్నితేల్చి చెప్పారు కేసీఆర్. నిజానిక కేసీఆర్ ప్రెస్ మీట్ ముందు వరకూ లాక్ డౌన్ పొడిగింపు మీద బోలెడన్ని థియరీలు వినిపించాయి. ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో.. తన వాదనను వినిపించారో.. ఆయన మాటల్ని విన్నవారంతా లాక్ డౌన్ ను ఎత్తివేయటం ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయంలో క్లారిటీకి వచ్చేశారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత.. లాక్ డౌన్ ఎత్తివేత ఇప్పట్లో కుదరదని.. పొడిగింపు తప్పించి మరో మార్గం లేదన్న విషయాన్ని పలువురు ముఖ్యమంత్రుల నోట మాత్రమే కాదు.. తాజాగా ప్రధాని మోడీ నోటి వెంట కూడా వచ్చేసింది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏం చేస్తే మంచిదన్న విషయాల్లో తనకున్న విజన్ ఎంతన్న విషయాన్ని సీఎం కేసీఆర్ తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. చివరకు అంత పెద్ద మోడీ సైతం కేసీఆర్ మాటల్ని ఏకీభవించటమే కాదు.. ఆయన డైరెక్షన్ లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.