Begin typing your search above and press return to search.

ఐదేళ్లలో చేయని పనిని మోడీ చేశాడు..

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:01 AM GMT
ఐదేళ్లలో చేయని పనిని మోడీ చేశాడు..
X
ప్రధాని నరేంద్ర మోడీ మారిపోయాడు.. పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. రెండోసారి గద్దెనెక్కాక మోడీలో స్పష్టమైన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాసింత ఈసారి పనులు చేసేలాగానే కనిపిస్తున్నాడు. పారదర్శకంగానే ముందుకెళ్తున్నాడు.

2014లో గెలిచిన మోడీ కేబినెట్ సమావేశాలకు గానీ.. పార్లమెంట్ సమావేశాలకు గానీ హాజరయ్యాక ఒక్కసారి కూడా మీడియా ముందుకు బహిరంగంగా వచ్చి మాట్లాడింది లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా.. సీఎన్ ఎన్ ఐబీఎన్ భీకర జర్నలిస్టు కరణ్ థాపర్ గుక్కతిప్పుకోని ప్రశ్నలకు బెంబేలెత్తిన మోడీ ఆ ఇంటర్వ్యూ ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు..

ఆ తర్వాత ప్రధాని అయ్యాక కూడా ఏ సమావేశం తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి తన వాణి వినిపించింది లేదు.. మీడియాను గట్టిగా ఎదుర్కొన్నది లేదు..

కానీ ఆశ్చర్యం.. అనూహ్యం.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం.. ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేశాక మోడీ తొలిసారి పార్లమెంట్ ఆవరణలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సంఖ్యా బలం లేకున్నా కాంగ్రెస్ మాటకు విలువ ఇస్తామని.. సభకు వచ్చాక అంతా ఒకటే పక్షమని చెప్పుకొచ్చారు.

ఇలా మీడియా అంటే భయాన్ని వీడి తొలిసారి మాట్లాడారు మోడీ. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చివరి రోజున కూడా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన మోడీ జర్నలిస్టుల ప్రశ్నలను మాత్రం ఎదుర్కోకుండా అమిత్ షాకు వదిలారు. ఈసారి మాత్రం ధైర్యంగా జర్నలిస్టులను కాచుకొని మాట్లాడడం విశేషం.