Begin typing your search above and press return to search.

పీఎం కేర్స్ భారత ప్రభుత్వ ఫండ్ కాదు: స్పష్టం చేసిన పీఎం కార్యాలయం

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
పీఎం కేర్స్ భారత ప్రభుత్వ ఫండ్ కాదు: స్పష్టం చేసిన  పీఎం కార్యాలయం
X
ఒక ప్రధాని, సీఎం పదవి చేపట్టాక వారి ‘పీఎం కేర్, సీఎం కేర్’ నిధులు ఉంటాయి. వాటితో అత్యవసరంలో ఉన్న వారికి నేరుగా సాయం చేసే హక్కు ప్రధాని, ముఖ్యమంత్రులకు ఉంటాయి. వీటికోసం ప్రభుత్వమే కొన్ని నిధులను కేటాయిస్తుంది. అయితే పీఎం కేర్స్ ఫండ్స్ భారత ప్రభుత్వ నిధి కాదని భారత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఈ ఆగస్టులో పీఎం కేర్స్ ఫండ్‌పై సమర్క్ గంగ్వాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో పౌరులకు సహాయాన్ని అందించే గొప్ప ఉద్దేశ్యం కోసం పిఎమ్ కేర్స్ ఫండ్‌ను మార్చి 2020లో ప్రధాని ఏర్పాటు చేసినట్లు సమ్యక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం పిఎం కేర్స్ ఫండ్‌ను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాలని న్యాయవాది సమ్యక్ కోర్టును అభ్యర్థించారు. ఇదే విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరింది.

పీఎంవో వద్ద అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పీఎం కేర్స్ ఫండ్ అత్యంత పారదర్శకతతో పనిచేస్తుందని.. దాని నిధులను ఆడిటర్ చేత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) ఆడిట్ చేయిందని పేర్కొంది.

నిధులు, లావాదేవీల మంజూరుపై అఫిడవిట్ ను పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ నివేదికను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అందుకున్న ఉపయోగించిన నిధుల వివరాలతో ఉంచినట్లు పేర్కొంది. కానీ పీఎమ్ కేర్స్ ఫండ్ ప్రభుత్వ ఫండ్ కాకపోతే అది పిఎం ఫోటో, జాతీయ చిహ్నాన్ని ఉపయోగించడం మానేయాలని సమ్యక్ పిటిషన్ లో కోర్టును కోరారు..

అండర్ సెక్రటరీ అఫిడవిట్ తరువాత ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్ -జస్టిస్ అమిత్ బన్సల్ ధర్మాసనం కేసును సెప్టెంబర్ 27 కి వాయిదా వేసింది.

పీఎం కేర్స్ ఫండ్ భారత ప్రభుత్వానికి చెందినది కాదని తాజాగా పీఎంవో ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండో వేవ్ సమయంలో, పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రధాని మోడీ సృష్టించారు. దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున దీనికి నిధులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నిధులు ప్రభుత్వానివి కావని అనడం చూసి చాలా మంది షాక్ కు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మీడియా నివేదికలపై పీఎంవో పూర్తిగా మౌనంగా ఉంది.