పవన్ కమెడియన్ లా.. అలీ హీరోలా మాట్లాడారు!

Mon Apr 15 2019 14:29:26 GMT+0530 (IST)

PK Talked Like A Comedian  Ali Talked Like A Hero

పాపులర్ టాలీవుడ్ కమెడియన్ అలీ ఎన్నికలకు ముందు వైసీపీ లో జాయిన్ కావడంపై పవన్ ఫ్యాన్సే కాదు పవన్ కూడా అప్సెట్ అయ్యారు.  పవన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారిలో ఒకరైన అలీ ఇలా జనసేనలో కాకుండా మరో పార్టీలో చేరతారని ఊహించకపోవడంతోనే అలా జరిగింది.  దీనిపై పవన్ కాస్త ఘాటుగా స్పందిస్తూ అలీ కి ఎంతో సహాయం చేశానని.. అలీ బంధువుకు టికెట్ కూడా ఇచ్చానని.. అయినా ఇలా చేశారని ఆరోపించారు.  పవన్ వ్యాఖ్యలకు అలీ కూడా ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే. పవన్ ఇప్పటికీ తన గుండెలోనే ఉన్నాడని కానీ తను ఎవరినుంచి సహాయం పొందలేదని.. అల్లా దయవల్ల తన పరిస్థితి బాగుందని.. అసలు దేహి అని అడగాల్సిన పరిస్థితి వస్తే చనిపోతానని అన్నాడు. అసలు పవన్ తనను జనసేనలో చేరమని అడగలేదని అన్నాడు.  అసలు వైసీపీలో చేరకూడదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా అలీ వీడియో లింక్  ను షేర్ చేసిన ఆయన ''ఒక కమెడియన్ హీరోలాగా మాట్లాడడం..ఒక హీరో కమెడియన్ లాగా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశాడు.  

ఇక మరో ట్వీట్ లో బాలయ్యకు కూడా ఒక చురక అంటించాడు. ఒక ఫ్యాన్ మేడ్ ఇమేజ్ ను షేర్ చేశాడు ఆర్జీవి.  అందులో ''జగనన్న ప్రభుత్వంలో చంద్రబాబు కు రూ. 3000 ఫించన్..లోకేష్ కు గ్రామ సచివాలయంలో ఉద్యోగం.. బ్రహ్మణికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15000..  బాలకృష్ణ కు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం.. శత్రువు అయినా కానీ వాళ్ళకీ మంచి చేస్తున్నాం'' అని ఉంది.  ఈ ఇమేజి కి క్యాప్షన్ గా వర్మ ''బాలయ్యకు మెరుగైన వైద్యం కాదు.. మెరుగైన మానసిక వైద్యం'' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

మరో ట్వీట్లో  ఎలెక్షన్ కమీషన్ పై చంద్రబాబుచేస్తున్న విమర్శల వీడియో ను షేర్ చేసి ఒక సెటైర్ వేశాడు. "కేఏ పాల్ చంద్రబాబుగా మారారా లేక చంద్రబాబు కేఎ పాల్ గా మారారా?  కేఎ పాల్ టైమ్ అయిపోయింది.. ఈ వ్యక్తి కొత్త కేఏ పాల్."