Begin typing your search above and press return to search.

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేదు!

By:  Tupaki Desk   |   4 May 2021 11:30 PM GMT
ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేదు!
X
కరోనా పుణ్యమా అని జనాలకు ఆరోగ్యంపై స్పృహ కలిగింది. పౌష్టికాహారం తీసుకోవడం, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కు ధరించడం, అంతేకాకుండా తగు మోతాదులో ఆక్సిజన్ అవసరం వంటివి కరోనా కాలంలో ప్రతి ఒక్కరికీ అర్థం అవుతున్నాయి. ఈ మహమ్మారితో ఆరోగ్యం పట్ల అందరూ చైతన్యవంతులు అవుతున్నారు. ఇక కరోనా వచ్చినా రాకపోయినా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో శుభ్రమైన గాలి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్ రెండో దశలో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య ఆక్సిజన్. ప్రాణవాయువు స్థాయి తగ్గి ఊపిరి ఆడక కరోనా బాధితులు అల్లాడుతున్నారు. వైరస్ సోకినప్పుడే కాకుండా ముందు నుంచే ఆక్సిజన్ శుద్ధి చేసే దిశగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు ఉంచడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. కొన్ని మొక్కలు కొన్ని ప్రాంతాల్లో ఉంచితే ఇంటికి అందంతో పాటు ఆరోగ్యాన్నిస్తాయి. ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎరికా పామ్
కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులను ఈ మొక్క తొలగిస్తుంది. గాలిని శుభ్రపరుస్తుంది. ఈ మొక్క ఆకులపై దుమ్ము త్వరగా చేరుతుంది. మెత్తని వస్త్రంతో శుభ్రం చేస్తే చూడడానికి బాగుంటుంది. 45 రోజులకు ఒకసారి ఎండలో ఉంచితే చాలు. నేల పొడిగా ఉంచే కొన్ని నీళ్లు చల్లాలి. పెంపుడు జంతువులు ఈ ఆకులను తినలేవు.

సాన్సేవిరియా
ఇది రాత్రి పూట విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ ను ఆక్సిజన్ గా మార్చుతుంది. దీనినే స్నేక్ మొక్క అంటారు. ఈ మొక్కను లివింగ్ రూంలో ఉంచితే మంచిది. బాల్కనీలో నీడ ప్రాంతంలో పెంచవచ్చు. గాలి శుద్ధి అవుతుంది. తక్కువ నీరు, తక్కువ సూర్యకాంతిలో బతుకుతుంది. పిల్లలకు, పెంపుడు జంతువలకు దూరంగా ఉంచడం మేలు.

రబ్బరు
మూసి ఉన్న గదులు అనగా స్టడీ రూం, ఆఫీసు రూంలో దీనిని ఉంచాలి. గాలి శుభ్రపరుస్తుంది. తక్కువ సూర్యకాంతి, తక్కువ తేమలో ఇది పెరుగుతుంది. ఎక్కువ నీరు ఉంటే మొక్క కుళ్లిపోతుంది. ఫార్మాల్డిహైడ్‌ వంటి రసాయనాలను ఈ మొక్క తొలగిస్తుంది.

బోస్టన్ ఫెర్న్
గాలిలోని ఫార్మాల్డిహైడ్ ను ఈ మొక్క గ్రహిస్తుంది. పొగ, పెయింట్, సౌందర్య ఉత్పత్తుల నుంచి విడుదలయ్యే వాయువులను శుభ్రపరుస్తుంది. కిటికీ పక్కన ఉంచడం వల్ల శుభ్రమైన గాలిని ఇస్తుంది. గుబురుగా పెరిగే ఈ మొక్కను గాలిలో వేలాడేలా ఏర్పాటు చేయవచ్చు. ఇది అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నీళ్లు ఎక్కువ అవసరం ఉండదు. ఈ మొక్కలను పెంచడం వల్ల శుభ్రమైన ఆక్సిజన్ లభిస్తుంది. కృత్రిమ ప్రాణ వాయువు కోసం సిలిండర్ల అవసరం ఉండదు.