Begin typing your search above and press return to search.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రపంచవ్యాప్త నగరాల్లో మన ‘బెంగళూరు’

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రపంచవ్యాప్త నగరాల్లో మన ‘బెంగళూరు’
X
మన దేశంలోనే ఐటీసిటీ బెంగళూరు ఏకంగా విదేశాల్లోని నగరాలతో పోటీపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలవడం విశేషం. భారత్ లో కేవలం బెంగళూరుకు మాత్రమే ఈ ఘనత దక్కింది.

భారత్ సిలికాన్ వ్యాలీగా.. సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరు ఇప్పుడు ప్రపంచం దృష్టి కూడా ఆకర్షిస్తోంది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచస్థాయి నగరాల్లో బెంగళూరు కూడా ఉంది. బెంగళూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆరు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అందులో బెంగళూరు ఉండడం విశేషం.

బ్లూమ్ బెర్గ్ ప్రకారం.. ప్రవాసులను ఆకర్షించడంలో బెంగళూరు నగరం ముందుంది. ఒక అంచనా ప్రకారం.. మూలధన ప్రవాహం (వెంచర్ క్యాపిటల్) లండన్, శాన్ ఫ్రాన్సిస్ కో ల కన్నా బెంగళూరులోకే ఎక్కువగా వస్తున్నాయని వెల్లడైంది.

2016లో 1.3 బిలియన్ డాలర్లు ఉన్న మూలధన నిధులు 2020 నాటికి 7.2 బిలియన్లకు చేరిందని వెల్లడించింది. పెరుగుతున్న ప్రవాసులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయని తెలిపింది.

బెంగళూరు సాఫ్ట్ వేర్ కేంద్రంగా ఉండడమే కాకుండా.. వందలాది స్టార్టప్స్ కు నిలయంగా మారింది. ఇది విదేశీయులను సైతం ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడం వల్ల బెంగలూరు ప్రపంచస్థాయి నగరంగా మారే అవకాశం ఉందని బ్లూమ్ బర్గ్ అంచనావేసింది.

బెంగళూరుతోపాటు వరల్డ్ ఎమర్జింగ్ సిటీల జాబితాలో కౌలాలంపూర్, లిస్బన్, మెక్సికో సిటీ, దుబాయ్ రియో డీజెనిరో వంటి నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 500 కన్నా ఎక్కువ ఐటీ, బీపీఓ సంస్థలు ఇక్కడ ఉన్నాయి.