ఈ -బేబి: వీర్యాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి బిడ్డకు జన్మనిచ్చింది

Wed Sep 22 2021 05:00:02 GMT+0530 (IST)

Ordered semen In online and gave birth to a baby

ఇప్పుడంతా ఇన్ స్టాంట్.. అంతా ఆన్ లైన్ లోనే కొనేస్తున్నాం. కూర్చున్న చోటకే అన్నీ తెప్పించుకుంటున్నారు. ఇంట్లోనే ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. తినే ఆహారం నుంచి బట్టల వరకూ.. ఇంటి సమాను అంతా కూడా ఆన్ లైన్ లోనే.. అంతగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా అవసరాలు తీర్చుకోవడం జనాలకు అలవాటైపోయింది.అయితే ఓ మహిళ పిల్లలను కనడం కూడా ఆన్ లైన్ పైనే ఆధారపడింది. ఏకంగా బిడ్డలను కనడానికి కూడా ఆన్ లైన్ లోనే జరిగిపోయేంతగా మారిపోయింది. సాధారణంగా బిడ్డకు జన్మనివ్వాలంటే మగతోడు కావాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు.. టెక్నాలజీ పుణ్యమాని ఇదేమీ అవసరం లేకుండానే మగాడు లేకుండానే బిడ్డలను కనేస్తున్నారు అమ్మాయిలు.

ఇంగ్లండ్ లోని నార్త్ యార్క్ షైర్ కు చెందిన 33 ఏళ్ల స్టెఫానీ టేలర్ అనే మహిళకు ఓ పిల్లాడు ఉన్నాడు. ఆమె రెండో బిడ్డను కనాలని అనుకుంది. కానీ ఆమె భర్తతో విడిపోయింది.  ఈ క్రమంలోనే తన కొడుకుకు తోడుగా రెండో బిడ్డ ఉండాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఆమె యాదృచ్ఛిక స్పెర్మ్ డోనర్ కోసం ప్రయత్నించింది. జస్ట్ ఏ బేబీ యాప్ లో సెర్చ్ చేసి వీర్యాన్ని ఆర్డర్ చేసింది. రెండో బిడ్డకు ఆ వీర్యంతో యూట్యూబ్ లో వీడియో చూసి తన అండంలోకి ఆ వీర్యాన్ని ప్రవేశపెట్టి కృత్రిమ పద్ధతిలో గర్భాదారణ చేసుకుంది.

రెండు వారాల తర్వాత ఆమె గర్భం దాల్చింది. అలా 9 నెలల తర్వాత పండంటి ఆడబిడ్డకు  జన్మనిచ్చింది. ఈ పాపకు ఈడెన్ అనే పేరు పెట్టింది. ఇక తనకు వీర్యం ఇచ్చినదాతను ఈడెన్ భవిష్యత్తులో కలవాలనుకున్నా తనకు ఎటువంటి  సమస్య లేదని కూడా స్టెఫెనీ చెప్పింది. అయితే తనకు వీర్యం దానం చేసిన వ్యక్తి వివరాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు.

ఇలా ఆన్ లైన్ లో బిడ్డను కన్న అమ్మడు వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారింది. బిడ్డలను కూడా ఇలా కంటారా? అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.