పోలీసుల సరదా... నెటిజన్ల రిటార్ట్

Wed Jul 17 2019 17:43:37 GMT+0530 (IST)

ఇంటర్నెట్ వచ్చాక పోలీసులు చాలా సాఫ్ట్ అయిపోయారు. వారిలో రౌద్ర రసంతో పాటు హ్యూమరసం పెరిగింది. కాకపోతే సరదాలో తేడా వస్తే నెటిజన్ల నుంచి రిటార్టులు ఎదుర్కోక తప్పదు. అయితే ఏమాటకు ఆ మాటే... తెలంగాణ పోలీసులు మాత్రం హ్యూమరసంలో టాప్ గా నిలుస్తున్నారు. మొన్నామధ్య ట్రిపుల్ రైడింగ్ కి ఫైన్ పడిన ఓ యువకుడు ఫొటోలో మీకు ట్రిపుల్ రైడింగ్ కనిపిస్తుంది గాని సరిగ్గా చూడండి అది డబుల్ రైడింగ్ దయచేసి చలాన్ క్యాన్సిల్ చేయండని హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందించిన హైదరాబాదు ట్రాఫిక్ అడ్మిన్... అయ్యో సారీ అండీ మీ చలాన్ ను ట్రిపుల్ రైడింగ్ నుంచి హెల్మెట్ లెస్ రైడింగ్ కు మారుస్తాం మీరు మాత్రం తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాండి మర్చిపోకండేం అంటూ రిప్లయి ఇచ్చారు. ఇది వైరల్ అయ్యింది. అంత యాక్టివ్ గా ఉండాలి మరి.తాజాగా ఇలాంటి ట్రై చేసి రాజస్తాన్ పోలీసులు వైరల్ అయ్యారు. కాకపోతే వారి హ్యూమరసంలో కొత్తదనం లేదంటూ ట్రోలర్స్ తో సెటైర్లు వేయించుకున్నారు. రాజస్తాన్ పోలీసులు ఏం చేశారంటే... ‘అయ్యయ్యో! ఎవరైనా హెరాయిన్ పోగొట్టుకున్నారా? మరేం పర్లేదు. మా దగ్గరే భద్రంగా ఉంది! అది మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. వెంటనే రాకపోతే ఇంకెప్పటికీ అది మీకు దొరకదు. మీకు ఫుడ్ బెడ్ ఫ్రీ అని ప్రమాణం చేస్తున్నాం. త్వరపడండి‘  అని భారీగా పట్టుబడిన హెరాయిన్ స్టాక్ ఫొటో పెట్టారు. ఈ  సరదా ట్వీట్ ను చాలా మంది ఇష్టపడినా... సీనియర్ ట్రోలర్స్ మాత్రం ఆ పోలీసులను గిల్లారు.

‘మీరు అసోం పోలీసులను కాపీ కొట్టారు సార్’ అంటూ కొత్తదనం కోరుకుంటున్నాం అని కొందరు అంటే ‘దొంగలను పిలిస్తే వస్తారా? వెళ్లి  పట్టుకోకుండా ఏంటిది. మీరు ముంబై పోలీసుల నుంచి స్ఫూర్తి పొందారా‘ అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇంతకీ అస్సాంలో పోలీసులు ఏం చేశారా అని వెతుకుతున్నారా? ఇలాగే వారికి గంజాయి భారీగా పట్టుబడితే ''ఎవరిదైనా 6 క్వింటాళ్ల గంజాయి పోయిందా? బాధపడకండి.. రాత్రి అది మాకు దొరికింది సహాయం కోసం ధుబ్రి పోలీసులతో టచ్‌లో ఉండండి'' అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.  వారు పక్కా మీకు సహాయం చేస్తారు.’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయగా అది దేశ  వ్యాప్తంగా వైరల్ అయ్యింది. అందువలన పోలీసులారా... కొత్తలో ఈ రిటార్టులు కామన్... మీరు కూడా మా హైదరాబాదు పోలీసుల్లాగా కొంతకాలానికి బాగా రాణించాలని కోరుకుంటున్నాం.