ఆమె అందాలతో రెచ్చగొట్టింది.. ఇతడు రెచ్చిపోయాడు.. తర్వాత?

Sun Jun 13 2021 08:00:01 GMT+0530 (IST)

Online cheating in mumbai

ఆన్ లైన్ మోసాలు అంటూ నిత్యం ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాయ లేడీలు మోసగిస్తున్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. నిత్యం సైబర్ క్రైమ్ పోలీసులు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. అయినా.. కొన్ని గొర్రెలు మాత్రం అవేవీ పట్టించుకోవు. వెళ్లి నేరగాళ్లకు చిక్కి మొత్తం క్షవరం పూర్తయిన తర్వాత ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఇలాంటిదే మరో ఘటన. చదవండి...ముంబైకి చెందిన ఓ సింగర్. వయసు 21 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇతగాడికి సోషల్ మీడియాలో ఓ కిలేడీ తగిలింది. తన పేరు రెజీనా అని పరిచయం చేసుకుంది. అమ్మాయి ప్రొసీడ్ అయితే ఇంకేముందీ.. మనోడు అల్లుకుపోయాడంతే! నిత్యం చాటింగులు నడుస్తూనే ఉన్నాయి. అలా మొదలైన మీటింగు వెంటనే 'బ్లూ టర్న్' తీసుకుంది. నీలి చిత్రాలు పంపించడం మొదలు పెట్టిందా యువతి. మాటలతో రెచ్చగొడుతూ.. ఈ గొర్రెను కూడా లైన్లోకి తెచ్చింది.

తన నగ్న వీడియోలను పంపించిన ఆ సుందరి.. నీ టాలెంట్ చూపించవా? అని అడిగింది. ఈ మొనగాడు ఎందుకు ఆగుతాడు? తాను ఎంత పోటుగాడో చెప్పాలని బట్టలన్నీ విప్పేసి వీడియోలు తీసి పంపించాడు. ఆ తర్వాత వెంటనే ఫోన్ చేసిన సుందరి.. అడిగినంత డబ్బులు పంపించాలని చెప్పింది. తన వద్ద లేవని చెప్పగానే.. నీ బేర్ బాడీ సినిమా.. నెక్స్ట్ మినిట్ లో ఆన్ లైన్లో ఆడుతుందని భయపెట్టింది. ఇంకేముందీ..? పేమెంట్ మొదలైంది. విడతల వారీగా మొత్తం లక్షా 15 వేల రూపాయలు పంపించాడు. అయినా.. వేధింపులు ఆగలేదు.

ఇక తన వల్ల కాదంటూ.. వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. రేపు కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల అబ్బాయిలూ.. జర జాగ్రత్త!