Begin typing your search above and press return to search.

ప్రతి రెండు నిముషాల్లో ఒకరికి ఎయిడ్స్ సోకుతుందట!

By:  Tupaki Desk   |   26 Nov 2020 7:00 AM GMT
ప్రతి రెండు నిముషాల్లో ఒకరికి ఎయిడ్స్ సోకుతుందట!
X
ఎయిడ్స్ వ్యాధి ఒక్కసారి సోకితే నయంకావడం అసాధ్యం. నివారణ తప్ప చికిత్సలేదు ఆ మహమ్మారికి మరి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తుంది? ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తులతో లైంగిక సంబంధం ఉంటే ఆ వ్యాధి వ్యాపిస్తుంది. ఎయిడ్స్ కలిగిన వ్యక్తి రక్తం ఇతరుల రక్తంలో కలిసినా సంక్రమిస్తుంది. సురక్షిత శృంగారంతో ఎయిడ్స్ రాదు. కౌగిలింతలు, ముద్దులు, కరచాలనం వల్ల కూడా సక్రమించదు. ప్రపంచానికి తెలిసిన నిజం ఇది.

గత 40 ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది ఈ ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మాత్రమే కోలుకున్నారు. హెచ్‌ఐవీకి పలు రకాలుగా చికిత్స చేస్తున్నా.. ఆ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఔషధాలు, వ్యాక్సిన్‌ను మాత్రం ఇప్పటివరకు రాలేదు. ప్రపంచంలో ప్రతి వంద సెకెన్లకి ఒకరికి ఎయిడ్స్ సోకుతునట్టు UNICEF వెల్లడించింది.

ప్రపంచంలో సుమారు 3.7 కోట్ల మంది హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్‌తో బాధ పడుతున్నారు. UNAIDS లెక్కల ప్రకారం ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అంచనా. గత ఏడాది దాదాపుగా 28 లక్షల మంది ఎయిడ్స్ భారిన పడగా , వారిలో 20 ఏళ్ల లోపు వారు 3.20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 1.10 లక్షల మంది మరణించారు. 10.30 లక్షల మంది గర్భిణీలకి ఈ వైరస్ సోకగా , 68 వేలమంది పాలు తాగే పసిపిల్లలు కూడా ఈ వ్యాధి భారిన పడ్డారు. ఉత్తర ఆఫ్రికా , మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

ఐతే ఎయిడ్స్‌తో మరణించే వారి సంఖ్య 2010తో పోల్చితే 30శాతం వరకు తగ్గింది. యాంటి రెట్రావైరల్ థెరపీ వల్లే మరణాల సంఖ్య తగ్గుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచంలో ఇద్దరు మాత్రమే ఎయిడ్స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అత్యంత సంక్లిష్టమైన మూలకణ చికిత్స వల్ల వారికి వ్యాధి నయమైంది. ఐతే ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న ట్రీట్‌మెంట్ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.