అమెరికాలో కాల్పులు కలకలం .. ఒకరు మృతి - 20 మందికి తీవ్ర గాయాలు!

Tue Aug 11 2020 13:20:09 GMT+0530 (IST)

One killed, 20 seriously injured in shooting in US

అమెరికాలో మరోసారి కాల్పులు అలజడి రేపాయి. వాషింగ్టన్ లోని ఓ పార్టీలో జరిగిన గొడవ. చివరికి కాల్పులుకు దారి తీసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పై  అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొడవ అర్ధరాత్రి 12.30గం.లకు జరిగింది. గాయపడ్డ వారిలో 11 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 17 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ముగ్గురు కాల్పులుకు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే రాత్రి జరిగిన ఈ పార్టీకి సుమారు 400 మంది  హాజరయ్యారని తెలుస్తుంది అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 50మందికి మించి ఒక ప్రదేశంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నా.. ఇంత పెద్దగా పార్టీ నిర్వహించడం అధికారులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో తింటూ.. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గొడవ మొదలైంది అని ఆ గొడవ పెరిగి పెద్దదిగా మారి ..  కాల్పుల వరకు వెళ్ళింది అని తెలుస్తుంది.  అలాగే ఈ కాల్పులు జరిగిన ప్రదేశం ల భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఇక ఈ ఘటన పై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ .. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని . అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని తెలిపారు. మరికొంత మంది భయంతో కార్ల కింద దాక్కొన్నారన్నారు. మరోవైపు ఈ ఘటనలోఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియదు అని పోలీసులు తెలిపారు. కాల్పుల టనపై కేసు నమోదు చేయగా మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు పార్టీ నిర్వాహుకులపై కూడా కేసు నమోదు చేశారు.