Begin typing your search above and press return to search.

ఒక బస్సు.. ఇద్దరు కండక్టర్లు.. పరేషాన్లో ప్రయాణికులు

By:  Tupaki Desk   |   13 Nov 2019 8:12 AM GMT
ఒక బస్సు.. ఇద్దరు కండక్టర్లు.. పరేషాన్లో ప్రయాణికులు
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యం లో.. దాని ప్రభావం పెద్ద గా లేదన్న భావన కలుగజేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్ని తీసుకోవటం తెలిసిందే. ఇందు లో భాగం గా కొందరు తాత్కాలిక ఉద్యోగుల కు బస్సు డ్రైవర్లుగా.. కండక్టర్లు గా నియమిస్తూ.. పలు రూట్ల లో బస్సుల్ని నడుపుతోంది. ఈ కారణంగా కొన్నిచోట్ల చోటు చేసుకుంటునన ఘటనలు వార్తలు గా మారుతున్నాయి.

తాజాగా చెప్పే ఉదంతం కూడా ఈ కోవ కు చెందిందే. సాధారణం గా బస్సు ఏదైనా కండక్టర్ ఒకరే ఉంటారు. అందుకు భిన్నం గా ఇద్దరు కండక్టర్లు ఒకే బస్సులోకి వచ్చి చేసిన రచ్చ తో ప్రయాణికులు షాకయ్యారు. ఈ సిత్రమైన ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది.

సదాశివ పేట కు వెళ్లేందుకు వికారాబాద్ డిపో నుంచి అద్దె బస్సు బయలుదేరింది. ఆ సమయంలో డ్రైవర్ తో పాటు కండక్టర్ ఉన్నాడు. ఇక్కడి వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. బస్సు వికారాబాద్ స్టేషన్ కు చేరగానే మరో కండక్టర్ సీన్లోకి వచ్చాడు. బస్సు ఎక్కిన అతడు ఆ బస్సును తానే కండక్టర్ గా చెప్పుకున్నాడు.

వారం నుంచి సదరు బస్సు కు తానే కండక్టర్ గా ఉన్నానని.. ఉన్నట్లుండి నువ్వు ఎలా వస్తావని ప్రశ్నించాడు. దీనికి మొదటి కండక్టర్ బదులిస్తూ.. తాను డిపో నుంచి వస్తున్నానని.. తన చేతి లో ఉన్న టిమ్ మిషన్ ను కూడా చూపించాడు. అయినప్పటికీ రెండో కండక్టర్ ససేమిరా అన్నాడు. ఇలా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న లొల్లితో ప్రయాణికులు తలలు పట్టుకున్నారు. వీరి పంచాయితీ తర్చాలంటూ డిపో మేనేజర్ కు ఫోన్ చేసినా ఫలితం లేదంటున్నారు. ఇలా.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణం గా సిత్రవిచిత్రమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.