Begin typing your search above and press return to search.

ఒక్క బిట్ కాయిన్‌ కొనాలంటే రూ.14 లక్షలు కట్టాల్సిందే!

By:  Tupaki Desk   |   26 Nov 2020 7:30 AM GMT
ఒక్క బిట్ కాయిన్‌ కొనాలంటే రూ.14 లక్షలు కట్టాల్సిందే!
X
ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అయితే, ఒక్కో దేశంలో ఒక్కో కరెన్సీ చెలామణిలో ఉంటుంది. ఒక్కో దేశం కరెన్సీ విలువ మరో దేశం కరెన్సీ విలువకు సమానంగా ఉండదు. అమెరికా కరెన్సీ డాలర్. ఇండియన్ కరెన్సీ రూపాయి. ఒక డాలర్ ఒక రూపాయికి సమానం కాదు. మనకు ఒక డాలర్ కావాలంటే దాదాపు రూ.75 చెల్లించాలి. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదని ఎప్పుడైనా ఆలోచించారు. నాకు తెలిసి మీరు ఆలోచించి ఉండరు. కానీ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువై కరెన్సీ ఏది అంటే ... బిట్ కాయిన్. ఇది డిజిటల్ కరెన్సీ. గ్లోబల్ కరెన్సీ.

తాజాగా ఒక బిట్ కాయిన్ ధర ఏకంగా 19 వేల డాలర్లకి చేరింది. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే రూ. 14 లక్షలకి పై మాటే. దాదాపు మూడేళ్ళ క్రితం ఈ క్రిప్టో కరెన్సీ పుంజుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే ఈ బిట్ కాయిన్ విలువ 20 వేల డాలర్లకి చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 లో ఏకంగా దీని విలువ 160 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండకపోవడం,పరపతి విధానాల్లో మార్పులు దీనికి కారణం. వచ్చే మరో ఆరు నెలల వరకు బిట్ కాయిన్ ధర పైపైకి చేరొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మన దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం లేదు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 2018లో క్రిప్టో కరెన్సీపై బ్యాన్ విధించింది. అయితే దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు 2020 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. రానున్న కాలంలో బిట్ కాయిన్ ధర ఏకంగా 20 వేల డాలర్ల పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ చాలా సెక్యూర్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు. దీన్ని హ్యాక్ చేయడం కష్టం. బ్లాక్ ‌చైన్ టెక్నాలజీ ఆధారంగా ఇది పని చేస్తుంది. డిమాండ్ సప్లై ప్రాతిపదికన బిట్ కాయిన్ ధర మారుతూ ఉంటుంది.