Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ వేరియంట్.. ఊరట కలిగిస్తున్న డబ్య్లూహెచ్ వో ప్రకటన

By:  Tupaki Desk   |   4 Dec 2021 1:06 AM GMT
ఒమిక్రాన్ వేరియంట్.. ఊరట కలిగిస్తున్న డబ్య్లూహెచ్ వో ప్రకటన
X
కరోనా మహమ్మారి రెండేళ్ల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ చిన్న వేడుకకు వెళ్లినా ఓ పదిరోజుల పాటు మనసులో ఏదో అనుమానం కలుగుతూనే ఉంది. వైరస్ ఎక్కడ సోకుతుందోనని భయంతోనే బతుకుతున్నారు. ఏప్రిల్ లో రెండో దశ విజృంభించిన విషయం తెల్సిందే. సెకండ్ వేవ్ లో ఎంతోమంది కొవిడ్ ధాటికి బలయ్యారు.

ఇకపోతే అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అయితే ఇటీవల పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మరో వేరియంట్ పుట్టుకొచ్చింది. డెల్టా వేరియంట్ మాదిరిగా ఇది కూడా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. దాంతో జనాల్లో మళ్లీ కరోనా గుబులు మొదలైంది.

ఒమిక్రాన్ వేరియంట్ తో భయాందోళనలకు గురవుతున్న వేళ డబ్య్లూహెచ్ వో దీనిపై స్పందించింది. ప్రమాదకరమైన ఈ వేరియంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కొత్త వేరియంట్ పట్ల పెద్దగా భయపడాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్ వో స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ తో ఒక్క మరణం కూడా సంభవించలేదని స్పష్టం చేసింది.

ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లోనూ దాదాపు 99.8 శాతానికి పైగా డెల్టా రకానికి చెందినవేనని తెలిపింది. గత 60 రోజుల నుంచి వచ్చిన జోనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల్లో డెల్టా వేరియంట్ కేసులే అధికమని పేర్కొంది. అయితే చాలా దేశాల్లోనూ ఈ వేరియంట్ ప్రజలను ఆందోళనలకు గురి చేస్తోందని వివరించింది.


ఇకపోతే భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ బాధితులు స్పల్ప స్థాయిలో పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తే అతిపెద్ద ముప్పునుంచి బయటపడతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంటి వస్తున్న ప్రయాణికులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాగా దేశంలో ఒమిక్రాన్ పట్ల కేంద్రం అప్రమత్తంగా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఈ వేరియంట్ ను కట్టడి చేయడానికి తగిన ఏర్పాట్లను ముందు నుంచే చేస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. మళ్లీ స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైతేనే బయటకు వెళ్లడం వంటివి మళ్లీ కొన్నాళ్లు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అతిపెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.


కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొవడానికి తెలంగాణ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కేసులు తేలినా... అందుకు తగిన విధంగా కట్టడి చర్యలు తీసుకునేలా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఇటీవల ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 12 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. అయితే ఆ ఫలితాల్లో ఏ వేరియంట్ తేలుతుందోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నారు.


ఈ విధంగా వివిధ దేశాలు, భారత్ లోని రాష్ట్రాలు ఒమిక్రాన్ పట్ల వణికిపోతున్న వేళ... పెద్ద ప్రమాదం లేదని డబ్య్లూహెచ్ వో ప్రకటించడం నిజంగా గుడ్ న్యూస్. అయితే అలా అని నిబంధనలు గాలికి వదిలేయకూడదు. మరికొన్నాళ్ల పాటు స్వీయ నియంత్రణ, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.