Begin typing your search above and press return to search.

ఏపీలో భయపెడుతున్న ఒమిక్రాన్..30 మంది మిస్సింగ్?

By:  Tupaki Desk   |   3 Dec 2021 7:00 AM GMT
ఏపీలో భయపెడుతున్న ఒమిక్రాన్..30 మంది మిస్సింగ్?
X
దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కూడా ఇప్పుడు భారత్ లోకి వచ్చేసింది. బెంగళూరులో ఐదుగురికి ఈ వైరస్ సోకింది.

ప్రస్తుతం ఈ వేరియంట్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజూకూ విస్తరిస్తోంది.ఈ ప్రమాదకర వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించింది.

ఒమిక్రాన్ వైరస్ భారత్ లోకి రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న వారిపై ఫోకస్ పెట్టాయి.

ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్ రేగుతోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ఆచూకీ దొరకకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గడిచిన 10 రోజుల్లో 60మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారు. వీరిలో 9 మంది ఆఫ్రికాకు చెందినవారున్నారు. అయితే మొత్తం 60 మందిలో 30 మంది ఆచూకీ తెలియడం లేదు. వారు ఎక్కడున్నారో కనిపెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 60 మంది విదేశీయుల వివరాలు సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలనుకున్నారు.కానీ అందులో చాలా మంది ఆచూకీ దొరకడం లేదు.

మొత్తం 60 మందిలో 30 మంది విశాఖపట్నంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి కరోనా పరీక్షలు చేసి శాంపిల్స్ ను సేకరించి టెస్టులకు పంపిస్తున్నారు.

మిగతా 30 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదు.