ఇదేం అనుభవం బాబు?..లోకేశ్ నామినేషన్ పై అభ్యంతరం!

Tue Mar 26 2019 16:55:35 GMT+0530 (IST)

Objections Raised On Nara Lokesh Nomination

షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ఆయన కుమారుడు లోకేశ్ కు గుండెలు అదిరిపోయే మాటను రిటర్నింగ్ అధికారులు చెప్పారు.  రాజకీయాల్లో తనకు మించిన తోపు లేరని.. సీనియార్టీ విషయంలో తన తర్వాతే ఎవరైనా అని చెప్పే చంద్రబాబు సిగ్గు పడేలా.. ఆయన కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్ పై రిటర్నింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయటం సంచలనంగా మారింది.మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్ లోని ఒక అంశంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటరీ చట్టం లోని సెక్షన్ 9 ప్రకారం లోకేశ్ దాఖలు చేసిన అఫిడవిట్ కు సంబంధించి నోటరీ కృష్ణా జిల్లాకు చెందినది కావటంపై అభ్యంతరం వ్యక్తమైంది.

గుంటూరు జిల్లా పరిధిలోని అసెంబ్లీ స్థానానికి.. కృష్ణా జిల్లాకు చెందిన నోటరీ ఉండకూడదని తేల్చారు అదనపు పత్రాల కోసం లోకేశ్ కు అధికారులు 24 గంటల సమయాన్ని ఇచ్చారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోకేశ్ నామినేషన్ పత్రాల్లో చోటు చేసుకున్న తప్పిదంపై టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అంగబలం.. అర్థబలం.. అధికార బలం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావటమా?  ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ పత్రాల్లో ఇలాంటి లోపం దేనికి సంకేతం?  ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

చిన్న చిన్న నేతలు సైతం చక్కగా నామినేషన్ల పత్రాలు తయారుచేసుకునే వేళ.. ఇంత తప్పుల తడకగా నామినేషన్ దాఖలు చేయటం షాకింగ్ గా మారింది.ఎందుకైనా మంచిది మరోసారి చినబాబు నామినేషన్ ను మరోసారి చెక్ చేసుకోవటం మంచిదేమో?