Begin typing your search above and press return to search.

ఎల్లో కాదు.. రెడ్ కాదు.. వైట్ కార్డు.. ఫుట్ బాల్ చరిత్రలో తొలి

By:  Tupaki Desk   |   24 Jan 2023 10:00 PM GMT
ఎల్లో కాదు.. రెడ్ కాదు.. వైట్ కార్డు.. ఫుట్ బాల్ చరిత్రలో తొలి
X
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం ఫుట్ బాల్. దీనికి నిదర్శనం గత నెలలో ముగిసిన ప్రపంచ కప్. ఇక అంతటి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరెంత రసవత్తరంగా సాగిందో అందరూ చూశారు. ఫ్రాన్స్-అర్జెంటీనా మధ్య జరిగిన ఆ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. మొదట అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి వెళ్లడం, ఆపై ఫ్రాన్స్ స్కోరు సమం చేయడం, మళ్లీ అదనపు సమయంలో చెరో గోల్ చేయడం.. అది పెనాల్టీ షూటౌట్ కు దారితీయడం.. అందులో ఫ్రాన్స్ విఫలం కావడం.. అర్జెంటీనా జగ్గజ్జేతగా నిలవడం అందరూ చూశారు. అయితే, పెనాల్టీ షూటౌట్ లో ఎంబాపె మినహా ఫ్రాన్స్ కీలక ఆటగాళ్లు లేరు. గ్రీజ్ మన్ తదితరులు ఆ సమయంలో డగౌట్ లో కనిపించారు. దీనికి కారణం.. వారు అంతకుముందు ఎల్లో కార్డును ఎదుర్కొనడమే.

ఎల్లో చూపిస్తారిలా.. ఫుట్ బాల్ లో ఆటగాళ్ల ప్రవర్తను అదుపు చేయడానికి చూపే రెండు కార్డుల్లో ఇదొకటి. ఆన్‌ఫీల్డ్ రిఫరీ ఒక ఆటగాడికి ఎల్లో కార్డు చూపడం అంటే.. ఒక విధంగా సరైన స్ఫూర్తితో ఆడడం లేదని అర్థం.

బెంచ్‌పై ప్రత్యామ్నాయంగా, ప్రత్యామ్నాయ ఆటగాడికి లేద జట్టు అధికారికి ఫౌల్‌లకు పాల్పడినట్లు గుర్తించడానికి పసుపు కార్డును చూపుతారు. ఇవి అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు నిర్దేశించిన ఆట చట్టాల ప్రకారం ఉంటాయి.

రెడ్ కార్డు పడిందంటే డేంజరే అది 2006 ప్రపంచ కప్ ఫైనల్. ఇటలీ-ఫ్రాన్స్ మధ్య మ్యాచ్. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు జినెదిన్ జిదానె మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఇటలీ స్ట్రయికర్ మెటరాజ్జీ మొరటుగా వ్యవహరించడం, ఇద్దరి మధ్య ఘర్షణ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. చివరకు జిదానె.. మెటరాజ్జీని తలతో ఢీకొట్టడం, అతడు రెడ్ కార్డుకు గురవడం.. ఫైనల్ మ్యాచ్ ఫలితం మారిపోయి, ఇటలీ విజేతగా నిలవడం అన్నీ జరిగిపోయాయి.

''హింసాత్మక ప్రవర్తన లేదా ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశాన్ని నిబంధనలకు విరుద్ధంగా,ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వంటి తీవ్రమైన నేరానికి పాల్పడిన ఆటగాడికి రెడ్ కార్డ్ చూపుతారు. మ్యాచ్ లో చిన్న తప్పిదాలకు పాల్పడి రెండు పసుపు కార్డులు పొందిన ఆటగాడికి కూడా రెడ్ కార్డ్ చూపుతారు.వైట్ కార్డూ ఉంది పైన చెప్పుకొన్న రెండు కార్డులూ కాకుండా.. ఫుట్ బాల్ లో వైట్ కార్డు కూడా ఉంది.

చరిత్రలో తొలిసారిగా ఇలాంటి కార్డును పోర్చుగల్ లో బెన్సికా, స్పోర్టింగ్ లిస్బన్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. మ్యాచ్ మొదటి భాగంలో గ్యాలరీలోని ఓ ప్రేక్షకుడు అస్వస్థతకు గురికావడంతో రెండు జట్ల మెడికల్ టీమ్ లు అతడికి చికిత్స అందించాయి. దీన్ని గమనించిన రిఫరీ.. వైట్ కార్డు చూపారు. కాగా, హుందాగా ఆడినందుకు కూడా వైట్ కార్డును చూపుతారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.