Begin typing your search above and press return to search.

ఏపీలో అలా పట్టుబడితే 8ఏళ్ల జైలు

By:  Tupaki Desk   |   9 July 2020 11:30 AM GMT
ఏపీలో అలా పట్టుబడితే 8ఏళ్ల జైలు
X
ఏపీలో మద్యం ధరలు డబుల్ కావడం.. పక్క రాష్ట్రాల నుంచి చీప్ మద్యం ఏపీకి తరలివస్తుండడంతో ఈ అక్రమ మద్యంపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. మద్యం అక్రమ రవాణాపై చట్టాలను మరింత కఠినతరం చేసింది.

ఎవరైనా అక్రమంగా మద్యం రవాణా చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు పదేపదే మద్యం అక్రమంగా తరలిస్తే 8ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు. ఈ మేరకు మద్యంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు చట్టబద్దత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాజాగా సవరించిన ఎక్సైజ్ చట్టం 34 ప్రకారం ఒకే వ్యక్తి పలుమార్లు ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సాధారణ కేసుల్లోనూ రెండేళ్లకు తగ్గకుండా శిక్షలు పడేలా చట్టాన్ని సవరించారు.

ఏపీలో అక్రమంగా మద్యం రవాణా కాకుండా.. నాటుసారా రూపంలో కల్తీ మద్యం తయారు కాకుండా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్వతంత్ర్య వ్యవస్థగా పనిచేస్తుంది. దశల వారీగా మద్యం నిషేధం దిశగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.