జియో ఫోన్‌కు ధీటుగా నోకియా సీ01.. అదిరిన ఫీచర్స్

Tue Sep 14 2021 12:34:42 GMT+0530 (IST)

Nokia C01 compatible with Jio Phone

ఒకప్పుడు ఇండియన్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో మొట్ట మొదటగా బేసిక్ ఫీచర్ మోడళ్లతో సంచలనాలు క్రియేట్ చేసినటువంటి నోకియా మొబైల్ గురించి తెలియని వారు ఉండరేమో. అప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర చిన్న డబ్బా ఫోన్ ఉండేది. అది కచ్చితంగా నోకియా మొబైల్ అనే చెప్పాలి. ప్రతి పల్లెకు కూడా ఇది చేరింది. దీంతో అప్పట్లో అందరూ కూడా దీన్నే వాడేవారు. కాగా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ల ప్రపంచం ఊపు ఇండియాలోకి ఎంటర్ అవ్వడంతో నోకియా క్రమంగా వెనకబడిపోయింది. కాగా ఇప్పుడు జియో సంస్థ తీసుకొచ్చిన జియోఫోన్ తక్కువ బడ్జెట్‌లోనే అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక డబ్బా ఫోన్‌లో నెట్ తీసుకొచ్చిన చరిత్ర కూడా జియోకే దక్కింది.అయితే జియో ఫోన్ వచ్చిన తర్వాత అందరూ కూడా అంటే పల్లెటూరిలో ఉండే పేదవారంతా కూడా ఈ ఫోన్ లను వాడేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇక జియో సిగ్నల్ కూడా బాగా రావడంతో అందరూ ఇలాంటి నెట్ వర్క్‌నే కోరుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ షాకిస్తూ 'నోకియా సీ01'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్ తో నోకియా సంస్థ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది త్వరలోనే ఈ ఫోన్‌ను నోకియా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫక్షన్ వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా కూడా చిప్ కొరత కారణంగా లేట్ అయింది. ఇక జియో 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియో నెక్ట్స్'ను దీపావళికి విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే జియో సంస్థ ప్రకటించింది. ఇక నోకియా కూడా అదే సమయంలో జియోకి పోటీగా నోకియా బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం మార్కెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది.

ఇక రాబోయే దీపావళీ సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతున్న ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్ నోకియా సీ01లో ఆండ్రాయిడ్11(గో ఎడిషన్) వెర్షన్‌తో అందుబాటులోకి వస్తోంది. ఇది తక్కువ ర్యామ్ తో ఉండి ఫోన్‌లో యూట్యూబ్ తోపాటు జీమెయిల్ గూగుల్ లాంటి లైట్ వెయిట్ యాప్స్ యూజ్ చేసుకునే ఉంటుంది. ఇక ఇది 5.45 అంగుళాల హెచ్‌డీస్క్రీన్ కలిగి ఉంటుంది. అలాగే హై డైనమిక్ రేంజ్‌లో అత్యంత క్వాలిటీగా ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంది. అంతే కాదండోయ్ దీనికి రెండు 5 మెగా ఫిక్సెల్ కెమెరాలు ఆక్టాకోర్ 1.6జీహెచ్‌జెడ్ యునిసోక్ SC9863A ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నాయి.

దీంతో మరో అడ్వాంటేజ్ ఏంటంటే మైక్రో ఎస్‌డీ కార్డ్ తో ఫోన్ స్టోరేజీని బాగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.ఇక ఈ ఫోన్‌ను ఫుల్ ఛార్జింగ్ పెడితే గనక 3000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీతో ఒక రోజు మొత్తం యూజ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇక నోకియా సీ01 ధర ఇండియాలో రూ.5999 ఉంది. అయితే దీనిపై 10శాతం డిస్కౌంట్‌తో మై జియో యాప్‌లో మన ఇండియాలో కేవలం రూ..5399కే అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది బ్లూపర్పుల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.