Begin typing your search above and press return to search.

వధువుకు కరోనా సోకినప్పటికీ పెళ్లి తంతు వరుడు ఆపలేదు

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:15 AM GMT
వధువుకు కరోనా సోకినప్పటికీ పెళ్లి తంతు వరుడు ఆపలేదు
X
కరోనా వైరస్ ప్రపంచాన్నే స్తంభింపచేసింది. జనాలను అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టింది. విద్య, ఉద్యోగ, ఉపాధి పూర్తి పోయింది. ఇక సామూహిక వేడుకలు బంద్ అయిపోయాయి. ఎంతో మంది తమ పెళ్లిళ్లను, ఇతర శుభకార్యాలను వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే అన్ లాక్ లో ప్రపంచం తేరుకుంటోంది.

అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ పెళ్లిళ్లు ఇప్పుడు మళ్లీ మొదలవుతున్నాయి. తక్కువ మందితో భౌతిక దూరం పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

తాజాగా ఓ జంటను కరోనా కూడా విడదీయలేకపోయింది. వధువుకు కరోనా సోకినప్పటికీ పెళ్లి తంతు వరుడు ఆపలేదు. ధైర్యం చేసి మరీ కరోనా బాధితురాలైన తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.

బ్రిటన్ దేశానికి చెందిన లారెన్, పాట్రిక్ డెల్గడో జంట నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత మే నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే పెళ్లికి కరోనా లాక్ డౌన్ అడ్డు వచ్చింది. ఇక ఇప్పుడు అన్ లాక్ తో పెళ్లికి రెడీ కాగా.. ఐదురోజుల ముందు వధువుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏం చేయలా వారికి పాలుపోలేదు.పెళ్లి కోసం తీసుకున్న పర్మిషన్ గడువు ముగిస్తే మళ్లీ దొరకడం కష్టం కావడంతో కరోనా ఉన్నప్పటికీ పెళ్లి తంతు పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు.

వధువు ఇంట్లోనే వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో గల రూమ్ కిటీకి వద్ద వధువు.. కింద గ్రౌండ్ లో వరుడు ఉండి ఒక రిబ్బన్ సహాయంతో ఉంగరాలను మార్చుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం వివాహాన్ని పూర్తి చేశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.