Begin typing your search above and press return to search.

ప్రభుత్వ వైద్యుల ‘ప్రైవేటు’ వ్యాపారానికి ఏపీ సర్కార్ చెక్

By:  Tupaki Desk   |   26 Sep 2021 9:59 AM GMT
ప్రభుత్వ వైద్యుల ‘ప్రైవేటు’ వ్యాపారానికి ఏపీ సర్కార్ చెక్
X
ప్రభుత్వ సొమ్ము తింటూ.. ప్రభుత్వ పనిచేయడానికి చాలా మందికి ఎందుకో అనాసక్తి ఉంటుంది. ఒక్కనెల జీతం రాకపోయినా గగ్గోలు పెట్టే కొందరు తమకు కేటాయించిన విధులు మాత్రం సరిగా నిర్వర్తించరు. ఇది వైద్య శాఖలో విపరీతంగా ఉంది. ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్న కొందరు ఆసుపత్రుల్లో సరైన వైద్యం చేయడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులను పరీక్షించరు. ఏదో తమ సమయం గడిచిపోవాలా... అన్నట్లుగా చీటి మీద నాలుగు మందులు రాయడం వారిని అక్కడి నుంచి పంపించేయడం చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న తీరింది. ఇక కొందరు ప్రభుత్వ డాక్టర్లుగా జీతం తీసుకుంటూనే ప్రైవేట్ గా క్లినిక్ లు పెట్టుకొని నడిపిస్తున్నారు. ఇలాంటి వారిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నివేదికలు తెప్పించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వైద్యశాఖలో పక్షళన చేయాలని నిర్ణయించింది. అయితే వైద్యుల సహాయ నిరాకరణతో ఇది ముందుకు సాగడం లేదు. తాజాగా నాడు-నేడు అనే కార్యక్రమం ద్వారా వైద్యశాఖపై దృష్టి పెట్టనుంది. ఇందులో వైద్యుల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేక అధికారులను నియమించనుంది. 2019లో రిటైర్డ్ ఐఏఎస్ సూజాతారావు నేతృత్వంలో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించారు. ఇందులో వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రల్లోనే సొంత ప్రాక్టీస్ పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. అయితే దీనిని ఆసరగా చేసుకున్న కొందరు ప్రభుత్వ ఆసుపత్రులను తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చిన కొందరిని తమ సొంత క్లినిక్ కు రెఫర్ చేస్తున్నారు. ఆ తరువా అదే ట్రీట్ మెంట్ ను క్లినిక్ లో అందించి డబ్బులు దండుకుంటున్నారు. ఇక కొందరు వైద్యులైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డబ్బులు తీసుకుంటున్న దాఖాలున్నాయి. ఇలాంటి వారి వల్ల నిజాయితీగా వైద్యం చేస్తున్న వైద్యులపై కూడా ప్రభావం పడుతోంది. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రులకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో వైద్యు పనితీరుపై కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల వరకే పరిమితమైంది. ఆ తరువాత కరోనా మహమ్మారితో వైద్యుల ప్రాధాన్యం పెరిగిపోవడంతో ఇందులో ప్రక్షాళనకు అవకాశం లేకుండా పోయింది. ప్రజలకు వైద్యం అత్యవసరంగా మారడంతో వైద్యులపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు ప్రైవేట్ క్లినిక్ లను జోరుగా ఏర్పాటు చేస్తున్నారు. తమ ప్రైవైట్ క్లినిక్ లో రోగులను తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు.

ఇక ప్రైవేట్ క్లినిక్ లుపెట్టుకోలేని వారు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులతో కాంటాక్టు పెట్టుకుంటున్నారు. వీరితో డీలింగ్స్ మాట్లాడుకొని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను అక్కడికి పంపిస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడంతో రోగులు చేసేదేమీ లేక వైద్యు చెప్పిన ఆసుపత్రులకు వెళుతున్నారు. ఇలా ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకొని అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వీరి సంపాదనకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.

కేవలం వైద్యులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన పరిస్థితి మారదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని సౌకర్యాలు కల్పిస్తే వ్యాధిగ్రస్తుతు ప్రభుత్వ ఆసుప్రతులకు వస్తారంటున్నారు. అయితే కొందరు ప్రభుత్వ వైద్యులు ఈ అసౌకర్యాలను సాకుగా చూపి వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరి జగన్ ప్రభుత్వ ఇలాంటి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటోందనన అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వైద్యశాఖలో ప్రక్షాళనతో ప్రజలకు సరైన వైద్యం అందితే అంతకుమించిన సంతోషమేముందని అంటున్నారు.