Begin typing your search above and press return to search.

కోహ్లి డిప్రెషన్​ కు అనుష్క అందానికి ముడి పెట్టాడేమిటి?

By:  Tupaki Desk   |   1 March 2021 1:30 PM GMT
కోహ్లి డిప్రెషన్​ కు అనుష్క అందానికి ముడి పెట్టాడేమిటి?
X
2014 ఇంగ్లాండ్​ పర్యటనలో తాను డిప్రెషన్​కు గురయ్యానని విరాట్​ కోహ్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా భారత మాజీ క్రికెటర్​ ఫరూఖ్​ ఇంజనీర్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.‘విరాట్​ కోహ్లీ కుంగుబాటుకు గురయ్యానని చెప్పడంతో నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను. కోహ్లీకి ఎంతో అందమైన భార్య ఉంది. అప్సరస లాంటి భార్య ఉండటం అతడి అదృష్టం. అతడికి ఇప్పుడో కూతురు కూడా పుట్టింది. నిజానికి అంత అందమైన భార్యదొరకడం విరాట్​ అదృష్టం. అతడు డిప్రెషన్​కు గురికావడం ఏమిటి. నిజానికి అంత అందమైన భార్య దొరికినందుకు విరాట్​ దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు ఫరూఖ్​.

విరాట్​ కోహ్లీ భార్యపై గతంలోనూ పలువురు సీనియర్​ క్రికెటర్లు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఓ సారి సునీల్​ గవాస్కర్​ కోహ్లిపై నోరుపారేసుకున్నాడు.. లాక్​డౌన్​ టైంలో కోహ్లీ .. తన భార్య అనుష్క శర్మతో క్రికెట్​ ఆడాడు. అందుకే ఇప్పుడు సరిగ్గా ఆడలేకపోతున్నాడంటూ గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

అయితే తాజాగా మరో మాజీ క్రికెటర్​ ఫరూఖ్​ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అనుష్క ఎంతో అందంగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతున్నది. అయితే ఫరూఖ్​ ఈ వ్యాఖ్యలు సరదాగానే చేశారు. దీనిపై విరుష్క దంపతులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విరాట్​, అనుష్క దంపతులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.