వారసులకు నో చాన్స్... షాకిచ్చిన జగన్...?

Thu Sep 29 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

No chance for heirs

తాము కాకపోతే తమ వారు అంటూ కొందరు ఎమ్మెల్యేలు కీలక నేతలు వైసీపీలో వారసులను ముందుకు తెస్తున్నారు. దాని కోసం వారు తమకు  తాముగానే నిర్ణయం తీసుకుని తమ వారసులను ఇప్పటి నుంచే జనాల్లోకి పంపిస్తున్నారు. అలా తాము రెస్ట్ తీసుకుంటూ గడపగడపకు వారసులను పరిచయం చేస్తున్నారు. అయితే ఈ మధ్యన ఒక మాజీ మంత్రి కుమారుడు ఒక నియోజకవర్గంలో తిరుగుతూంటే జనాలే అతన్ని నిలదీసి ప్రశ్నించారని ప్రచారం కూడా సాగింది.మేము మీ నాన్నకు ఓటేస్తే మీరు ఎందుకు వచ్చారంటూ జనాలే గట్టిగా ఆడిగారని కూడా వార్తలు వచ్చాయి. మరి కొన్ని చోట్ల తండ్రులను పక్కన పెట్టి అతి ఉత్సాహంతో వారసులు రోడ్డున పడ్డారు. మరి వీరంతా జగన్ ఆలోచనలు తెలిసే ఇలా చేస్తున్నారా లేక తమ మాట అధినేత తప్పక విని తమ వారసులకు టికెట్లు ఇస్తారని అతి ధీమాకు పోతున్నారా అన్నది పార్టీ వారికే అర్ధం కాని పరిస్థితి ఉంది.

అయితే తాజాగా నిర్వహించిన పార్టీ వర్క్ షాప్ లో జగన్ వారసుల విషయంలో కుండబద్ధలు కొట్టారు. తాను వారసులకు టికెట్ ఇచ్చేదే లేదని తేల్చేశారు. మీరు ఇంట్లో ఉండి మీ వారసులను బంధువులను గడప గడపకూ పంపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఓట్లేసిన జనాల వద్దకు మీరే వెళ్ళాలి. మీరే వారితో మమైకం కావాలి. మీ పనితీరు మార్చుకుంటే టికెట్లు మీకే ఇస్తాను తప్ప మీ వారసులకు కానే కాదు అని కూడా పేర్కొన్నారని టాక్.

అంటే కొంతమంది తెలివైన నాయకులు తమకు వివిధ కారణాల వల్ల టికెట్ నిరాకరిస్తే వారసులను ముందు పెట్టి టికెట్ సంపాదించాలని వేస్తున్న ఎత్తుగడలకు ఆదిలఒనే జగన్ చెక్ చెప్పేశారు అని అంటున్నారు. ఆ విధంగా ఉత్తరాంధ్రాలో కొన్ని నియోజకవర్గాల్లో వారసులు జనంలో తిరుగుతున్నారు.

అలాగే కోస్తాలొని  క్రిష్ణా జిల్లాతో పాటు రాయలసీమలో కొన్ని చోట్ల వారసులు హల్ చల్ చేస్తున్నారు. అలాంటి వారి మనసులో తాము కాకపోతే ఈసారి తమ వారే తమ సీటుకు  ఎమ్మెల్యే అన్న ఆలోచన ఉంది. కానీ అలాంటివి కుదరవు అని జగన్ పక్కాగా చెప్పేసి గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇపుడు తామే జనంలోకి వెళ్లాలి. అప్పటికిఈ పనితీరు మారకపోతే కొత్త వారికే టికెట్లు ఇస్తారు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. మొత్తానికి వర్క్ షాప్ కాదు కానీ చాలా మందికి ఈ విషయాలు అర్ధం కావడానికి చాలా టైం పట్టిందని అంటున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.