చంద్రబాబు.. ఎందుకు ప్రెస్ ముందుకు రాలేదు?

Fri Apr 12 2019 11:23:30 GMT+0530 (IST)

No Press meet After Polling From Chandrababu Naidu

పోలింగ్ అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ కు రాకపోవడంపై చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఇలాంటి అవకాశాలను ఏ మాత్రం వదులుకునే వారు కాదు. పోలింగ్ అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలపై బాబు మాట్లాడాల్సింది. విజయం మీద విశ్వాసం వ్యక్తం చేయడంతో పాటు.. కార్యకర్తలకు స్థైర్యం ఇచ్చే మాటలు మాట్లాడటానికి మీడియా ముందుకు రావాల్సింది.నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఖరారే అని సమాచారం ఇచ్చారు. రాత్రి పదిగంటలకు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు అని పేర్కొన్నారు. ఒక వైపు పోలింగ్ దాదాపు పూర్తి అయ్యాకా నారా లోకేష్ ధర్నాకు దిగారు. ఆ ధర్నా కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు ప్రెస్ తో మాట్లాడతారు అని అంతా అనుకున్నారు. అయితే.. బాబు మీడియా ముందుకు రాలేదు.

ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ..తెలుగుదేశం పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారట. బాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు అని - నూటా ముప్పై స్థానాల్లో తెలుగుదేశం గెలుస్తుందని ఆయన ఆ కార్యక్రమంలో ప్రకటించారని తెలుగుదేశం మీడియా పేర్కొంది.

అయితే అదంతా లీక్ రాజకీయం. ప్రెస్ మీట్ పెట్టడానికి - తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది.

చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో.. దానిపై రకరకాల వ్యాఖ్యానాలు సహజంగానే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు స్పందిస్తారా? ఏం మాట్లాడతారా? అనే దాన్ని బట్టి.. ఫలితాలపై బాబు ఏమనుకుంటున్నారనే విషయం గురించి స్పష్టత వస్తుంది!