పండుగ రోజునా వారికి పని...

Sat Jan 15 2022 15:47:56 GMT+0530 (IST)

No Holidays For Banks In Andhapradesh

పండుగ అంటేనే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఫెస్టివల్ మూడ్ తో అంతా ఉంటారు. దాంతో ఆ జాయ్ ని ఆపడం ఎవరి తరం కాదు బంధువులు స్నేహితులతో గడపాలని ముచ్చట్లు పెట్టుకోవాలని ఆరాటపడతారు. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వ రంగ  సంస్థలకు ఈ సంక్రాంతి వెరీ స్పెషల్ గా ఉందిట. అవును సంక్రాంతి రోజున వాళ్ళు బ్యాంకులను తెరచి భారంగా కూర్చున్నారు. పని చేస్తూ ఇదేం పాపం అనుకుంటున్నారుట.ఏపీలో ఇతర ఉద్యోగులకు పండుగ వేళ మూడు రోజుల పాటు సెలవులు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దానికి తోడు ఆదివారం కూడా జత కలిసింది. కానీ బ్యాంక్ ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వలేదు. పండుగ వేళ కూడా పనిచేయాలని తమను ఆదేశించడం సరికాదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ అంటోంది.

రాష్ట్రమంతా సంక్రాంతి హడావుడిలో ఉండగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్  సిబ్బంది మాత్రం విధుల్లో ఉండడం బాధాకరమని పేర్కొంది. శనివారం సెలవు కావాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయింది.  మొత్తానికి ఎందుకో ఇలా చేశారు అని ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి.

నిజానికి పండుగ  రోజున బ్యాంకుకు వచ్చే వారు ఎవరూ ఉండరు.  ఉత్తనే ఖాళీగా కూర్చోవాలి.   అదే ఈ రోజు  సెలవు ఇస్తే మరో రోజున అవసరం అయిన సందర్భాల్లో పనిచేయడానికి బ్యాంక్ ఉద్యోగులు సిద్ధంగా ఉంటారు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి సర్కార్ వారి ఆదేశాలు అయితే సంక్రాంతి సంబరాలను పూర్తిగా దూరం చేశాయని వారు ఆవేదన పడుతున్నారు అంటే ఆలోచించాల్సిందే.