Begin typing your search above and press return to search.

ఈ పండ్ల జ్యూస్ తో 100 రోగాలకు చెక్‌

By:  Tupaki Desk   |   31 July 2021 10:30 AM GMT
ఈ పండ్ల జ్యూస్ తో 100 రోగాలకు చెక్‌
X
మనకు ఏళ్ల నాటి నుంచి చాలా ఫలాలు ఆరోగ్యం కాపాడేందుకు అందుబాటులో ఉండేవి. కానీ మనలో చాలా మందికి వాటి వల్ల ఉండే ప్రయోజనాలు సరిగా తెలియక వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు. ఏ చిన్న జబ్బు చేసినా కానీ వైద్యుల దగ్గరికి పరుగెత్తుతూ లక్షల్లో డబ్బులను వృథా చేసుకుంటున్నారు. కానీ అసలు పండ్ల వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం లేదు. తీరా ఆస్పత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగినా తర్వాత కూడా వ్యాధి నయం కాకపోయే సరికి వీటి ప్రయోజనాలను గురించి తెలుసుకుని బాధడపడుతారు. అటువంటి పండ్లలో ఒకటి ఈ తొగరు పండు.

ఇది తింటే దాదాపు 100 రకాల జబ్బులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం పండు మాత్రమే కాదు ఈ మొక్క ఆకులు, బెరడు ఏవి తిన్నా సరే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరో అద్భుత విషయం ఏంటంటే.. ఈ పండులో దాదాపు 150 కి పైగా పోషకాలు ఉన్నాయని చాలా మంది పెద్దలతో పాటు ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జ్యూస్ ని తాగితే క్యాన్సర్ తో సహా.. అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు నయమవుతాయని చాలా మంది నమ్ముతారు. ఇలా అనేక ఔషధ గుణాలున్న తొగరు పండ్లకు మార్కెట్ రేట్ కూడా తక్కువగానే ఉండడం గమనార్హం.

వీటి వలన కలిగే ప్రయోజనాలను గనుక పరిశీలిస్తే... అందరూ నివ్వెరపోతారు. అవునా అని ముక్కున వేలేసుకుంటారు. కరోనా కంగారు ప్రస్తుత రోజుల్లో అందరినీ కలవరపెడుతుంది. మంచి ఇమ్యూనిటీ పవర్ ను కలిగి ఉంటేనే ఈ రోజుల్లో బెటర్ అని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. అందుకోసమే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఈ తొగరు జ్యూస్ ఎన్నో రకాల ప్రయోజనాలను సమకూరుస్తుందని చెబుతున్నారు. ఈ జ్యూస్ ని కనుక మన రోజూ వారీ ఆహారంలో కలుపుకుని సేవిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

అధిక బరువును తగ్గించుకునేందుకు చూసే వారిలో కూడా తొగరు జ్యూస్ మంచి ఔషధంగా పని చేస్తుంది. ఈ జ్యూస్ లో మన బరువును తగ్గించే కారకాలు ఉంటాయి. కావున ఎవరైతే త్వరగా బరువును తగ్గాలని చూస్తారో వారికి ఇది అత్యుత్తమ ప్రయోజనకారిగా ఉంటుంది. దీనిని వాడడం వల్ల ఊబకాయం సమస్యతో పాటు చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెప్పడం గమనార్హం. కేవలం బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో చెక్కరల స్థాయిని కూడా ఈ జ్యూస్ కంట్రోల్ చేస్తుంది.

తరుచుగా ఈ జ్యూస్ ని తాగడం వలన షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడకుండా కూడా కాపడుకోవచ్చు. ఇలా పకృతిలో మనకు లభించే ఎన్నో పండ్ల వల్ల అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక సీజనల్ పండ్లను తప్పకుండా తినాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. తొగరు పండ్లు ఈసారి మీకు ఎక్కడ కనిపించినా తింటారని ఆశిస్తున్నాం.