భారత్ కు అప్పగిస్తే ఆత్మహత్యే ..కొత్త డ్రామాకి తెరతీసిన 'నీరవ్ మోడీ'

Thu Jul 22 2021 10:17:05 GMT+0530 (IST)

Nirav Modi New Drama

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని భారత్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో లండన్ కోర్టులో అప్పీల్ కు వెళ్లిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ  సంచలన వ్యాఖ్యలతో మరో డ్రామాకు తెరతీశాడు. తనను భారత్ కు అప్పగించొద్దని కోర్టుకు మెరపెట్టిన నీరవ్ భారత్ కు అప్పగిస్తే తనకు ఆత్మహత్యే శరణ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే నీరవ్ కు లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు అప్పీల్ కు లండన్ కోర్టు తిరస్కరించింది. ఫలితంగా అతన్ని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్టే. ఈ తరుణంలో భారత్ కి రాకుండా ఉండేందుకు నిరవ్ మోడీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశంలోని ఆర్ధిక నేరాల్లో నిందితుడు కావడంతో నీరవ్ మోడీని భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలు ఇచ్చింది. ఇండియాలో మనీలాండరింగ్ నమ్మకద్రోహం వంటి నేరారోపణలు ఎదుర్కోనాల్సిందేనని కోర్టు తేల్చింది.

లండన్ కోర్టుకు నీరవ్ మోడీ అప్పీల్ కు వెళ్లారు.   బ్యాంకు లకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టి విదేశాల్లో తల దాచుకుంటున్న నీరవ్ మోదీ.. ఆర్థిక నేరాల్లో నిందితుడు కావడంతో అతన్ని భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. భారత్ లో మనీల్యాండరింగ్ నమ్మకద్రోహం వంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రుణం పొంది ఆ తర్వాత ఆ రుణంను ఎగొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని ముంబై ప్రత్యేక కోర్టు ఆర్థిక నేరస్తుడిగా అధికారికంగా ప్రకటించింది.  ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కోర్టు నీరవ్‌ను ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడనే ముద్ర పడిని రెండవ వ్యక్తిగా నీరవ్ మోడీ నిలిచాడు. పార్లమెంటులో ఆర్థిక నేరగాళ్లపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది కేంద్రం. ఆర్థిక నేరస్తులుగా ఒక వ్యక్తిపై ముద్ర పడితే అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కును విచారణ సంస్థలకు ఈ చట్టం కల్పిస్తుంది. అంతేకాదు విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయే వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు విచారణ సంస్థలకు అన్ని అధికారాలను కట్టబెడుతూ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆర్థిక నేరస్తుడిగా ముద్ర పడిన తొలి వ్యక్తిగా విజయ్ మాల్యా నిలిచారు.

నీరవ్ మోడీ అతని మామ మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తప్పుడు ధృవపత్రాలు చూపించి రుణాలు పొందారు. ఎప్పుడైతే ఈ కుంభకోణం వెలుగు చూసిందో ఇక అప్పటి నుంచి ఇద్దరు పరారీలో ఉన్నారు.   దేశం వీడి పారిపోయారు. దీంతో సీబీఐ ఈ కేసును విచారణ చేయడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే నీరవ్ మోడీ చోక్సీలు ఇద్దరూ తమపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. భారత్ అధికారులు మోడీని ఇండియా కి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.