ఆమెకు 19.. వెళ్లింది ఎవరితో తెలిస్తే షాకే

Sun Jul 12 2020 14:20:19 GMT+0530 (IST)

Nineteen year old girl had gone with a Old Men

గుజరాత్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. ఒక ప్రముఖ మీడియాసంస్థ రిపోర్టు చేసిన దాని ప్రకారం.. పటాన్ జిల్లాలోని సిధ్ పూర్ తాలుకాలోని ఒక గ్రామంలో అరుదైన ఉదంతం చోటు చేసుకుంది. పందొమ్మిదేళ్ల ఒక అమ్మాయి ఒక ముసలాయన (పెళ్లైన కూతురు.. ఆమె ఇద్దరు పిల్లలకు పెళ్లైనవారే)తో వెళ్లిపోయినట్లుగా చెబుతున్న ఉదంతం షాకింగ్ గా మారింది.ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఒక కేసు విచారణకు వచ్చింది. తమ ఇంట్లో అమ్మాయి ఈ నెల రెండున ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదన్నారు. చివరకు ఆరా తీస్తే పొరిగింట్లో ఉండే తాతే ఆమెను తీసుకెళ్లినట్లుగా తమకు తెలిసినట్లుగా యువతి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు మాత్రం కేసు బుక్ చేయలేదన్నారు. అయితే.. ఆ అమ్మాయి మైనర్ కాదని.. యువతి కావటంతో తామేమీ చేయలేమన్నది పోలీసుల వాదన.

ఇదిలా ఉంటే.. తమ కుమార్తె ఫ్యూచర్ ప్రమాదంలో పడిందని.. ఆమె లైంగికంగా కూడా వేధింపులకు గురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ కేసును వీడియో కాన్ఫరెన్సులో విచారించిన కోర్టు.. ఈ యువతిని ఈ నెల 29న కోర్టులో హాజరుపర్చాల్సిందిగా న్యాయస్థానం ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. సదరు యువతి కోసం వెతుకుతున్నామని.. మరింత సమయం కావాలని పోలీసులు కోరుతున్నారు. పందొమ్మిదేళ్ల అమ్మాయి.. అంత పెద్ద వయస్కుడితో వెళ్లిపోవటం హాట్ టాపిక్ గా మారితే.. ఆమె వెళ్లిపోలేదు.. ఆ తాతయ్యే తీసుకెళ్లి ఉంటారన్న మాట నమ్మశక్యంగా లేవన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో అసలేం జరిగిందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం.. వెళ్లిపోయిన ఆ యువతి కోర్టు ముందుకు వచ్చి నోరు విప్పితే కానీ అసలు విషయం ఏమిటో అర్థమయ్యే అవకాశం ఉంది.