రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని వీడిన నిమ్మగడ్డ?

Sun Jan 24 2021 14:45:36 GMT+0530 (IST)

Nimmagadda who left the state overnight?

ఏపీలో పంచాయితీ ఎన్నికల కేంద్రంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య వార్ నడుస్తోంది. నిమ్మగడ్డ తీరుపై తాజాగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర హెచ్చరికలు సైతం జారీ చేశారు. మా ప్రాణాలకు విలువ లేదా అని నిలదీశారు.ఈ క్రమంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ నిన్న నోటిఫికేషన్ జారీ చేసి రాత్రికి రాత్రి రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార పార్టీ నేతలు ఉద్యోగ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

కరోనా వేళ విధులు నిర్వహించమని ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని నిమ్మగడ్డ విలేకరుల సమావేశంలోనూ ప్రస్తావించారు. నాపై భౌతిక దాడికి పాల్పడే అవకాశాలున్నాయని.. నాకు ప్రాణ హాని ఉందని నిమ్మగడ్డ అన్నారు. వెంటనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఇక ఈ వ్యాఖ్యలను వెంకట్రామిరెడ్డి ఖండించారు.

ఇక ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని వీడటం హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా వెళ్లిపోయారని.. ఎన్నికల కమిషన్ వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో పయనమయ్యారని సమాచారం. దీనిపై వైసీపీ నేతలు సోషల్ మీడియా విభాగం తీవ్ర విమర్శలు సెటైర్లు వేస్తున్నారు.

ఇక ఏపీ ఎస్ఈసీ ఎన్నికలకే వెళితే తామంతా సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే అవకాశమే లేదని స్పష్టం చేశారు. సోమవారం సుప్రీంకోర్టు తీర్పును బట్టి తమ కార్యాచరణ ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.