చంపుతారట.. ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ లేఖ!

Sat Jan 23 2021 23:52:50 GMT+0530 (IST)

Nimmagadda letter to AP DGP

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తూ కాకరేపుతున్నారు. దీనిని ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు వ్యతిరేకిస్తూ అంతే ధీటుగా బదులిస్తున్నారు. దీంతో వ్యవహారం అంతా రచ్చరచ్చ అవుతోంది.తాజాగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.'వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని' లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. ప్రాణాలు తీస్తాం చంపుతాం అంటూ తనను బెదిరించారని వివరించారు.వెంకట్రామిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి నిమ్మగడ్డ లేఖ రాశారు.ఆయనపై నిఘా ఉంచి తనకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.