ఎపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ.. జగన్ సర్కార్ పై కామెంట్స్

Mon Aug 03 2020 15:20:09 GMT+0530 (IST)

Nimmagadda Sensational Cooments On Ap Government

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం ఈ మేరకు బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల ఏపీ ఎస్ఈసీగా హైకోర్టు ఆదేశానుసారం నిమ్మగడ్డను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిమ్మగడ్డ హైదరాబాద్ నుంచి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నారు నిమ్మగడ్డ.  రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పనిచేస్తుందని.. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నాను అంటూ అన్నారు.

శుక్రవారమే హైదరాబాద్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానని.. జిల్లా కలెక్టర్లకు తెలిపానని వివరించారు. జగన్ ప్రభుత్వం నుంచి తనకు సహకారం ఉంటుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు.