Begin typing your search above and press return to search.

రఘురామ రామ : మళ్ళీ దెబ్బ పడిందే...?

By:  Tupaki Desk   |   12 Aug 2022 2:58 PM GMT
రఘురామ రామ : మళ్ళీ దెబ్బ పడిందే...?
X
రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు రచ్చబండ ఢిల్లీలో ఫ్యామస్. ఒకనాడు ఆయన డైలీ రచ్చబండ వేదికగా మాట్లాడిన ప్రతీ మాట డైనమైట్ లా పేలింది. ఏపీలో అధికార వైసీపీని గడగడలాడించింది. అయితే ఇపుడు కాలం మారుతోంది. కధ ఎటూ కాకుండా పోతోంది. రఘురామ క్రిష్ణం రాజు కు కాని రోజులు వచ్చేశాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవే అని అంటున్నారు.

ఆయన సొంత నియోజకవర్గం నర్సాపురంలో మూడేళ్ళుగా అడుగు పెట్టలేకపోయాయు. బీజేపీకి చాలా దగ్గరవాడిని అని చెప్పుకునే ఆయన ప్రధాని మోడీ తన సొంత ఇలాగా వచ్చి భీమవరంలో అల్లూరి జయంతి సభ పెడితే దానికి కూడా రఘురామ హాజరు కాలేకపోయారు.

న్యాయ పోరాటం చేసినా ఫలితం నిల్. ఆయన తనకు అదనపు రక్షణ కావాలీ అంటే కేంద్ర రక్షణ కంటేనా అంటూ కోర్టు నిలదీసిన సంగతి కూడా తెలిసిందే. ఏదైతేనేమి మొత్తానికి ఆయన భీమవరం రాలేకపోయారు.

ఇక రఘురామ మరో విషయంలో ఇపుడు ఇబ్బంది పడుతున్నారు. రఘురామ కుమారుడు భరత్, ఆయన భద్రత సిబ్బంది ఇంటిలిజెన్స్ కానిస్టేబిల్ మీద ఈ మధ్య దాడి చేశారని తెలంగాణా పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. దాని మీద తెలంగాణా హై కోర్టుకు వెళ్ళిన రఘురామకు కేసు కొట్టేయాలి అంటే చుక్కెదురు అయింది. ఆ మీదట సుప్రీం కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయ పోరాటం చేశారు.

అయితే సుప్రీం కోర్టు కూడా రఘురామ వేసిన పిటిషన్ ని కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ ని కొట్టేసిన సుప్రీం కోర్టు ఈ కేసు విచారణకే మొగ్గు చూపింది.

దాంతో రఘురామ కుమారుడు భరత్, ఆయన భద్రతాసిబ్బంది మీద కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇవన్నీ చూసిన మీదట తేలింది ఏంటి అంటే రఘురామ న్యాయ పోరాటాలు ఆయనకు ఈ మధ్య అసలు ఏ మాత్రం కలసిరావడం లేదని, పైగా దెబ్బ మీద దెబ్బ పడుతోందని.