Begin typing your search above and press return to search.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టి.. చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు..!

By:  Tupaki Desk   |   24 Sep 2022 3:03 PM GMT
ఒక‌టి త‌ర్వాత ఒక‌టి.. చంద్ర‌బాబుకు విష‌మ ప‌రీక్ష‌లు..!
X
ఔను! ఇది టీడీపీకి విష‌మ కాల‌మే చెప్పాలి. ఇంకా అంత‌కు మించి అన్నా కూడా.. త‌ప్పుకాదు!! కొంత స్వ‌యంకృతం.. మ‌రికొంత‌.. నేత‌ల తీరుతో.. పార్టీ ప‌రిస్థితి దారుణ‌మై.. 2019లో అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీ అనుభ‌విస్తున్న‌ది.. అధినేత‌ను ప‌ట్టిపీడిస్తున్న‌దీ విష‌మ‌కాల‌మే..!! ఒక్క‌టంటే ఒక్క విజ‌యం ద‌క్క‌లేదు. అడుగ‌డుగునా.. వ్యూహాల లేమి.. అలివిమీరిన నేత‌ల‌.. ఉదాసీన వైఖ‌రి.. వెర‌సి.. పార్టీఇప్పుడు.. అతి పెద్ద విష‌మ స్థితిని ఎదుర్కొంటోంద‌న్న‌ది నిర్వివాదాంశం.

ఇది టీడీపీ సానుభూతి ప‌రుల‌కు.. నేత‌ల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు.. కానీ.. జ‌రుగుతున్న ప‌రిస్థితిని తెలుసుకుని.. త‌ప్పుల‌ను ఎంచుకుని.. స‌రిచేసుకోక‌పోతే... పార్టీ నిలదొక్కుకోవ‌డం.. భ‌విష్య‌త్తులో పుంజుకోవ‌డంకూడా క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వ‌చ్చిన మూడు ఉప ఎన్నిక‌ల్లో ఒక‌చోట‌ పార్టీ పోటీ చేసింది. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఏకంగా.. చంద్ర‌బాబు ఇక్క‌డే ఉండి మ‌రీ ప్ర‌చారం చేశారు. కానీ..ఫ‌లితం శూన్యం. ఇక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాలికి గ‌జ్జె క‌ట్టుకుని.. మ‌రీ ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగిన చంద్ర‌బాబు.. సిట్టింగు స్థానాలైన గుంటూరు కార్పొరేష‌న్‌, విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌, విశాఖ కార్పొరేష‌న్ల‌లో ఒక్క‌దానిని కూడా నిల‌బెట్టుకోలేక పోయారు. ఇక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు దూరం అని ప్ర‌క‌టించి.. నేత‌ల్లో నిస్తేజం నింపార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో స‌రైన వ్యూహాలు లేక‌పోవ‌డంతోనే కార్పొరేషన్లు వైసీపీ వ‌శ‌మ‌య్యాయ‌న్న వాద‌న కూడా ఉంది.

మ‌రీ ముఖ్యంగా గెలుచుకున్న మునిసిపాలిటీలైన తాడిప‌త్రి, కొండ‌ప‌ల్లిల్లో నూ త‌లెత్తుకుని తిరిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. నేత‌లు.. త‌మదే విజ‌యంమ‌ని చెబుతున్నారు త‌ప్ప‌.. ఎవ‌రూ పార్టీకి క్రెడిట్ ఇవ్వ‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఇవ‌న్నీ.. ఒక ఎత్త‌యితే..నేత‌ల మ‌ధ్య కొర‌వ‌డిన స‌ఖ్య‌త‌.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు..వెర‌సి.. పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తున్నా.. చంద్ర‌బాబు చేత‌న‌త్వం లేక‌.. చూస్తున్న ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌డుతోంది. ఒక‌వైపు... పార్టీ అధికారంలోకి వ‌స్తుందో రాదో.. అనే బెంగ నాయ‌కుల‌ను కుదిపేస్తోంది. గెలుస్తామ‌ని.. నిలుస్తామ‌ని.. వైసీపీని ఇంటికి పంపిస్తామ‌ని పైకి.. చంద్ర‌బాబు ఎన్ని చెబుతున్నా.. పార్టీలో ఆ త‌ర‌హా ధైర్యాన్ని మాత్రం ఆయ‌న నూరిపోయలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

యువ‌త‌కు సీట్లు అన్నారు.. వ‌చ్చే ఎన్నిక‌లు యువ‌త కేంద్రంగానే జ‌రుగుతాయ‌న్నారు. ఇంత‌లోనే..త్యాగాల‌కు రెడీ కావాల‌ని పిలుపునిచ్చారు. పొత్తులు అంటున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో.. క్లారిటీ లేదు. వైసీపీపై దూకుడు అంటున్నారు. ఈ దూకుడు కూడా ఎలాంటి ఫ‌లితాన్నీ ఇవ్వ‌డం లేదు. పైగా.. వైసీపీ తీసుకుంటున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తోసిపుచ్చ‌లేక .. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ప‌డుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి చేసి.. ఏడాది అవుతున్నా.. కేసు కూడా న‌మోదు చేయించ‌లేని ప‌రిస్థితి వెంటాడుతోంది. వెర‌సి.. వీటిపై ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు.. ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోక‌పోతే.. పుట్టిమున‌గ‌డం పెద్ద‌దూరంలో లేద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.