Begin typing your search above and press return to search.

జగన్ ముద్దులు వర్శెస్ లోకేష్ ముద్దులు.. పాదయాత్ర పదనిసలు!

By:  Tupaki Desk   |   29 Jan 2023 9:56 AM GMT
జగన్ ముద్దులు వర్శెస్ లోకేష్ ముద్దులు.. పాదయాత్ర పదనిసలు!
X
జగన్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఒకే విమర్శ చేస్తూ ఉంటుంది. పాదయాత్రలో ప్రతీ వారికి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారని ఆ తరువాత వారి మీద అనేక రకాలైన భారాలు వేసి గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు నుంచి లోకేష్ బాబు దాకా అందరూ ఘాటైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి జగన్ పాదయాత్రలో ముద్దులు హైలెట్ అయ్యాయి. ఇపుడు చినబాబు పాదయాత్ర స్టార్ట్ చేశారు. అది రెండవ రోజు దాటగానే ముద్దుల ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది.

కుప్పంలో ఆయన పాదయాత్ర సాగుతోంది. అలా ఆయన రోడ్ల వెంట నడచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా మహిళలకు పెద్దలు, స్వాగతం పలుకుతున్నారు. లోకేష్ తమ ఇళ్ళ పక్క నుంచి నడచుకుంటూ పోతూంటే ఆపి మరీ పెద్ద వయసు మహిళలు ఆయన నుదుటి మీద ముద్దు పెట్టి ఆయన్ని దీవించి పంపిస్తున్నారు. ఈ సన్నివేశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలా లోకేష్ పాదయాత్రలో ముద్దుప పర్వం ఆరంభం అయింది అని అంటున్నారు. అయితే లోకేష్ తానుగా ఎవరిని పిలిచి ముద్దులు పెట్టి సందడి చేయడంలేదు అని అంటున్నారు. పెద్దవారు తమ ప్రేమను అలా చాటుకుంటున్నారు అని ఇది తెలుగుదేశం మీద లోకేష్ మీద వారికి ఉన్న నిండు అయిన అభిమానం తప్ప మరోటి కాదని అంటున్నారు.

అలా జగన్ని ముద్దులు గుద్దులూ అంటూ విమర్శించిన తెలుగుదేశం పార్టీకి లోకేష్ కి కూడా ముద్దులతో జనాలు స్వాగతం పలకడం ఒకింత ఆనందంగా ఉన్నా ఇది విమర్శల పాలు అవుతుందా అన్న టెన్షన్ కూడా ఉందిట. అయితే తాము ఎవరినీ మభ్యపెట్టడంలేదని, ఎవరికీ కబుర్లు చెప్పి పబ్బం గడుపుకోవడం లేదని, ప్రజలే తాముగా వస్తున్నారు అని వారే తమను దీవిస్తున్నారు అని అంటున్నారు.

కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, లోకేష్ పాదయాత్ర వెంట వేలాదిగా కదిలి వస్తున్న జనాలను చూస్తే వారికి అర్ధం అవుతుంది అని కూడా తమ్ముళ్ళు సెటైర్లు వేస్తున్నారు. ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు అంటే ప్రజలకు ఉన్న అభిమానానికి ఇది నిద్రశనం అని వారు అంటున్నారు.

ఇదిలా ఉండగా రెండవ రోజు పాదయాత్రలోనూ జగన్ సర్కార్ మీద మాటల తూటాలను లోకేష్ పేల్చారు. ఏపీలో విద్వంశ పాలన సాగుతోందని అన్నారు. తమ పార్టీని నిర్మాణం అభివృద్ధి చేసే అజెండా అని ఆయన చెప్పుకున్నారు. తమ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమని తాము ప్రజలకు మేలు అయినా పాలన అందిస్తామని లోకేష్ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ ని చూసేందుకు ఎగబడుతున్న వారున్నారు. ఆయనకు ముద్దులు పెట్టే వారు కూడా ఉన్నారు. దాంతో తెలుగుదేశం లో కొత్త జోష్ కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.