Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నికల వేళ మోడీ ‘ఉల్లంఘనలు’.. దుమారం

By:  Tupaki Desk   |   5 Dec 2022 3:30 PM GMT
గుజరాత్ ఎన్నికల వేళ మోడీ ‘ఉల్లంఘనలు’.. దుమారం
X
గుజరాత్ఎన్నికల వేళ మోడీ ఉల్లంఘనలు ఎక్కువైపోయాయి. సొంత రాష్ట్రం అని ధీమానో.. లేక ఈసీ నన్ను ఏం చేస్తుందన్న ధిక్కారమో కానీ మోడీ రెచ్చిపోయారు. ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కారు. ఏకంగా ఓటు వేసేందుకు నడుచుకుంటూ ర్యాలీగా వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారు. ఇలా ఓటు వేసేందుకు రాకూడదని తెలిసినా.. ఈసీ నిబంధనలు ఒప్పుకోవని ఉన్నా కూడా మోడీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీన్ని కాంగ్రెస్ సహా పలువురు తీవ్రంగా తప్పు పట్టారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సోమవారం కొనసాగింది. ఈ ఎన్నికల్లో మోడీ ఓటేసేందుకు కొద్దిదూరం నడుచుకుంటూ పోలింగ్ కేంద్రానికి వెళ్లడంపై కాంగ్రెస్ సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మోడీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. రోడ్ షో చేపట్టారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండడం విచారకరమని విమర్శించింది.

అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆ సమయంలో తన కాన్వాయ్ నుంచి దిగిన మోడీ పోలింగ్ కేంద్రం వరకూ ఓటర్లకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వారిని ప్రభావితం చేశారు. ప్రధానిని చూసేందుకు వందలమంది అభిమానులు రాగా.. దారిపోడవునా వారికి అభివాదం తెలిపారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని, ఈసీ వ్యవహారిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించింది.

గుజరాత్ ఎన్నికల్లో ఈ రెండో విడత ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అంత బలంగా లేదు. పటేల్ వర్గానికి బలమైన ప్రభావం ఉంది. ఇక్కడ విజయం కోసం మోడీ దేశ ప్రధాని అన్న సోయి మరిచిపోయి గల్లీ లీడర్ లా వ్యవహరించాడు. పార్టీని గెలిపించకపోతే పరువు పోతుందని భయపడి ఏకంగా అన్ని రోజులు రోడ్ షోలు నిర్వహించారు. ఆ సమయంలో విన్యాసాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

నిజానికి వీఐపీలు ఓటు వేసేందుకు ఈసీ, పోలీసులు గ్రీన్ బెల్ట్ రూపొందించి ప్రత్యేకంగా పింక్ బూత్ ను ఏర్పాటు చేశారు. కానీ దాన్ని వినియోగించుకోకుండా మోడీ సాధారణ పౌరులు ఉన్న లైన్ లో నిలబడి మీడియా ముందు షో చేశారు. లైన్ లో సామాన్యుడిగా ఉంటూ ఓటేసినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఇది ఎన్నికలను ఓటర్లను ప్రభావితం చేయడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై ప్రస్తుతం అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.