కవితా.. గోబ్యాక్ తిరగబడ్డ.. న్యాయవాదులు.. ఎక్కడంటే

Wed Sep 28 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

News on MLC Kavitha

టీఆర్ఎస్ అధినేత సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆమె రంగారెడ్డి కోర్టుకు వెళ్లారు. అయితే కవితను పలువురు న్యాయవాదులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎప్పుడూ తమ సమస్యలను పట్టించుకోలేదని.. ఇప్పుడెలా కోర్టు వద్దకు వస్తారని ఆమెను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.న్యాయవాదులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతులు లేవని.. ఎవరైనా అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ .. లాయర్లు కవితకు వ్యతిరేకంగా.. నినాదాలు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా.. బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పేదలకు చీరలుకూడా పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు.. మంత్రులు.. కూడా హాజరు అవుతు న్నారు.

అయితే.. పలుచోట్ల.. చీరలుబాగోలేదని.. తీసుకునేందుకు మహిళలు వెనుకాడుతున్నారు. ఇంకొన్ని చోట్ల ``ఇన్నాళ్లకు వచ్చారా?`` అంటూ.. మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. ఎమ్మెల్సీ కవితకు కూడా..చేదు అనుభవం ఎదురైంది. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.