Begin typing your search above and press return to search.

బీసీల ఆధ్వర్యంలో కొత్తపార్టీ

By:  Tupaki Desk   |   23 Jan 2021 2:30 AM GMT
బీసీల ఆధ్వర్యంలో కొత్తపార్టీ
X
ఈ ఏడాది మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాదిలోనే కొత్త రాజకీయపార్టీ పెట్టడానికి బీసీ సంక్షేమసంఘ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతోంది. ఇందులో భాగంగానే బీసీ సంక్షేమసంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు అండ్ కో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ముద్రగడ సొంతూరు కిర్లంపూడికి వెళ్ళి మరీ బీసీ నేతలు సుమారు 5 గంటలపాటు భేటీ అయ్యారు.

సమాజంలో 52 శాతం ఉన్న బీసీలు, 35 శాతం ఉన్న కాపులు కలిస్తే ఇపుడున్న రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని కేశన స్పష్టంచేశారు. జనాభాలో సుమారు 85 శాతం ఉన్న పై రెండు సామాజికవర్గాలు కలిస్తే రాజ్యాధికారం కచ్చితంగా సాధిస్తాయని కేశన విశ్వాసం వ్యక్తంచేశారు. ముద్రగడ భేటిలో 13 జిల్లాల బీసీ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సంఘాల ముఖ్యులు ముద్రగడ భేటిలో కలిశారు.

5 గంటల భేటి తర్వాత ముద్రగడ మాట్లాడుతూ ముందు బీసీ సంఘాల్లోని జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించమని సలహాఇచ్చారు. సంక్షేమసంఘాన్ని రాజకీయపార్టీగా మారిస్తే జనాల ఆదరణ ఎంతవరకు ఉంటుంది, సొంత సామాజికవర్గంలో స్పందన ఏ మేరకు వస్తుందనే విషయాలపై ముందు అద్యయనం చేయమన్నారు. ఇదే విషయమై కేశన మాట్లాడుతూ ముద్రగ సూచన ప్రకారం ముందుగా రాష్ట్రస్ధాయిలో మేధోమధన రాజకీయ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

బీసీలు, కాపుల ఆధ్వర్యంలో కొత్త రాజకీయపార్టీ అనేది మంచి ఆలోచనే. కానీ జనాలాదరణ ఏమేరకు ఉంటుందన్నది అనుమానమనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయపార్టీ పెట్టేవాళ్ళకు అయినా ఆ పార్టీ తరపున పోటీ చేసే వాళ్ళయినా జనాల మద్దతుతో గెలవటం మామూలు విషయం కాదు. ఇఫుడున్న రాజకీయపార్టీల తరపున పోటీ చేస్తున్న బీసీలు, కాపు సామాజికవర్గం ప్రముఖులే గెలవటానికి నానా అవస్తలు పడుతున్నారు. వివిధ పార్టీల తరపున ఎంతమంది పోటీచేస్తున్నారు ? ఎంతమంది గెలుస్తున్నారు ? అన్నది లెక్కలు తీసుకుంటే విషయం అర్ధమైపోతుంది.