Begin typing your search above and press return to search.

లవ్ జిహాద్‌ ను అరికట్టేందుకు కొత్త చట్టాల అవసరమా?

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:30 PM GMT
లవ్ జిహాద్‌ ను అరికట్టేందుకు కొత్త చట్టాల అవసరమా?
X
ప్రేమించుకున్న యువతీ యువకులు వివాహం చేసుకునే సమయంలో మతం మార్చుకుంటున్నారు. ముస్లిం యువతి వేరే మతం అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకున్నా..లేదా ముస్లిం యువకుడు వేరే మతం అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నా..ముందుగా వారు మతం మారాల్సి వస్తోంది.

బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ''ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2020''ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హరియాణా, అసోం ఇలాంటి బిల్లుల్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వారి పెళ్లికి మతం అడ్డుగా నిలవటంతో తప్పనిసరిగా మతం మారుతున్నారు. అది వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే జరుగుతోంది. కానీ ఇకపై పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సిన పనిలేదంటోంది కొత్తగా రానున్న చట్టం.

''లవ్ జిహాద్'' అనే పదాన్ని ఏ భారత చట్టంలోనూ నిర్వచించలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇలాంటి కేసులు నమోదైనట్లు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థా వెల్లడించలేదు.

కొందరు ప్రేమ, పెళ్లి ముసుగులో బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల తర్వాత ఆడపిల్లలు ఎంతో వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి కేసులనే మీడియాలో లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు.

త్వరలో జరగబోతున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మతమార్పిళ్లపై బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

..‘‘లవ్ జిహాద్‌’’ను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు మత మార్పు నిషేధ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.

దేశంలో వివాహాల నమోదుకు ప్రత్యేక వివాహ చట్టాలున్నాయి. అయితే వీటి కింద ఒకే మతానికి చెందిన దంపతుల వివాహాలను నమోదు చేస్తారు.

ఒకవేళ వేరే మతాలకు చెందిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలంటే, ఇద్దరిలో ఒకరు రెండోవారి మతానికి మారాల్సి వచ్చేది.

ఈ సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌-1951ను కేంద్రం తీసుకొచ్చింది. దీని కింద వేరే మతంలోకి మారకుండానే చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు.

''పెళ్లి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దీనిపై చట్టాన్ని తీసుకురావడం రాజ్యాంగ వ్యతిరేకం. అని కొందరు అంటున్నారు.