Begin typing your search above and press return to search.

భారత వృద్ధిపై కొత్త ఆశలు

By:  Tupaki Desk   |   26 Sep 2020 5:30 PM GMT
భారత వృద్ధిపై కొత్త ఆశలు
X
కరోనా మహమ్మారితో ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏకంగా మైనస్ లలోకి చేరాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఎస్ అంద్ పీ అంచనావేసింది.

తాజాగా ఎస్ అండ్ పీ రేటింగ్ ఏజెన్సీ ఈ ఆర్థిక సంవత్సరంలో -9 గా భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ భారీగా తగ్గుతుందని తెలిపింది. ఆ తర్వాత 2021-22లో మాత్రం భారీగానే పుంజుకుంటుందని పేర్కొంది.

వచ్చే సంవత్సరం 2022లో భారత జీడీపీ 10శాతానికి ఎగిసిపడుతుందని ఎస్ అండ్ పీ అంచనావేసింది. పెట్టుబడులపై దృష్టిసారించడం.. ఉద్యోగాలను పెంచే విధంగా ప్రభుత్వం తీసుకునే కీలక సంస్కరణలు రికవరీకి ఉపయుక్తంగా ఉంటాయని తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రుణ లక్ష్యాన్ని రూ.7.8 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు పెంచిందని గుర్తు చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఆర్థిక లోటు 12.5శాతం వద్ద, ప్రభుత్వ రుణంలో 90శాతం వద్ద ఉంటుందని ఎస్ అండ్ పీ తెలిపింది.