సన్ రైజర్స్ కు కొత్తఅందం.. ఎవరీ మద్దుగుమ్మ..!

Mon Feb 22 2021 12:24:57 GMT+0530 (IST)

New beauty for Sunrisers

ఇటీవల చెన్నైలో ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వేడుకలో ఓ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. సన్రైజర్స్ తరఫున వచ్చిన ఈ బ్యూటీ ఎవరా? అని అందరూ  ఈమె గురించి ఆలోచించసాగారు. ఓ వైపు వేలం జరుగుతుంటే.. ఏ జట్టులో ఎవరు ఉండబోతున్నారు.. అనేదానికంటే ఎస్ ఆర్ హెచ్ తరపున  వచ్చిన ఈ అప్సరస ఎవరా? అని అందరూ వెదకసాగారు. ఆమె మరెవరో కాదు.. ఎస్ ఆర్ హెచ్ సీఈవో కావ్య మారన్. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో కావ్య మారన్ హాట్ టాపిక్ గా మారారు.  మొదటి సారి ఆమె ఐపీఎల్ వేలానికి రావడంతో మీడియా సోషల్ మీడియా దృష్టంతా కావ్యా మారన్ మీదకు వెళ్లింది.29 ఏళ్ల కావ్య మారన్.. సన్ టీవీ అధినేత కళానిధి మారన్ గారాలపట్టి. ఆమె సన్ మ్యూజిక్ - సన్ టీవీ ఎఫ్ ఎం ఛానల్స్ కు సీఈవోగా కూడా పనిచేస్తున్నారు.  కావ్య అప్పుడప్పుడు ఎస్ ఆర్ హెచ్ ఆడే మ్యాచ్ లను తిలకిస్తూ ఉంటుంది. అయితే చాలా రోజుల తర్వాత ఆమె ఐపీఎల్ వేలంలో కనిపించేసరికి అందరి దృష్టి ఆమె మీద పడింది. ఇక ఐపీఎల్ వేలం ముగిసిన విషయం తెలిసిందే. వివిధ ఫ్రాంచైజీల ఫైనల్ జట్లు ఖరారయ్యాయి. దీంతో ఇక ఐపీఎల్ అభిమానులు.. ఎప్పుడెప్పుడా ఈ మ్యాచ్లు జరుగుతాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ సీజన్ వచ్చేసిందటే చాలు అందరి దృష్టి దాని మీదే ఉంటుంది. ఆ టైంలో సినిమా విడుదలలు కూడా ఆపేస్తుంటారు. ఎంటర్ టెయిన్ మెంట్ చానల్స్కు కూడా టీఆర్ పీ రేటింగ్ లు తగ్గిపోతుంటాయి. అంటే ఐపీఎల్ కు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో ఊహించుకోవచ్చు.