Begin typing your search above and press return to search.

ఈ లేడీ క్రికెటర్ల జంట అమ్మానాన్నలయ్యారోచ్..

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:41 AM GMT
ఈ లేడీ క్రికెటర్ల జంట అమ్మానాన్నలయ్యారోచ్..
X
మీరు చదివింది నిజమే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం.. వారికో పాప కలగటం ఎలా అంటారా? చేతికొచ్చిన సాంకేతికత పుణ్యమా అని.. ఈ ప్రపంచంలో చావును తప్పించటం మినహా మరేదీ అసాధ్యం కాదు. న్యూజిలాండ్ లేడీ క్రికెటర్లు అయిన అమీ శాటర్ వైట్.. లియో తహుహులు మూడేళ్ల క్రితం పెళ్లాడి అప్పట్లో సంచలనంగా మారారు. ఈ లేడీ క్రికెటర్లు ఇద్దరు లెస్బియన్లు. వీరిద్దరూ భార్యభర్తలుగా జీవించేందుకు వీలుగా పెళ్లి చేసుకోవటమే కాదు.. అలా పెళ్లి చేసుకొన్న మొదటి మహిళా క్రికెటర్ల జంటగా రికార్డు క్రియేట్ చేశారు.

తాజాగా వారికి ముద్దులొలికే పాపకు జన్మనిచ్చినట్లుగా వెల్లడించారు. జనవరి 13న తమకు పాప పుట్టినట్లుగా తహుహు తాజాగా వెల్లడించారు. తాము తల్లిదండ్రులమైనందుకు గర్విస్తున్నామని.. పాపకు గ్రేస్ మేరీ శాటర్ వైట్ అన్న పేరు పెట్టినట్లుగా చెప్పారు. ఈ మహిళా క్రికెటర్ల జంటలో అమీ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ మాత్రమే కాదు..ఆల్ రౌండర్ కూడా. ఇక.. ఆమె పార్టనర్ తహుహు ఫాస్ట్ బౌలర్.

ఇంతకీ ఇద్దరు మహిళలకు పిల్లలు ఎలా పుడతారన్న సందేహంగా ఉంది. చాలా సింఫుల్. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఇది చాలా సులువు. లెస్బియన్లలో ఒక అండాన్ని తీసుకొని.. వారికి తెలిసిన వ్యక్తి వీర్యంతో ఫలదీకరిస్తారు. లేదంటే.. వీర్యాన్నిఅందించే బ్యాంకులో అరువుగా తీసుకొని ఫలదీకరిస్తారు. దాంతో తయారైన పిండాన్ని లెస్బియన్ జంటలోని మరో మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. దీంతో.. లెస్బియన్ దంపతులిద్దరికి పుట్టబోయే బిడ్డతో తమకు అనుంబంధం ఉంటుంది. దీంతో.. పుట్టిన వారికి తాము సహజమైన తల్లిదండ్రులుగా ఫీల్ అవుతుంటారు. ఒక మహిళ అండాన్ని ఇస్తే.. మరో మహిళ నవమాసాలు మోసి బిడ్డను కంటుంది. ఇక్కడ కూడా భార్య..భర్త పాత్రను పోషించేది ఇద్దరూ మహిళలే కావటమే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్.