Begin typing your search above and press return to search.

ఆంధ్ర లో కరోనా కల్లోలం !!

By:  Tupaki Desk   |   9 Aug 2020 3:24 PM GMT
ఆంధ్ర లో కరోనా కల్లోలం !!
X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. అలాగే 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 10,820 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,27,860కు చేరింది.

ఇక గడచిన 24 గంటల్లో ఏకంగా 97 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,036కు పెరిగింది. ఇక, కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 12 మంది - ప్రకాశంలో 11 మంది - చిత్తూరులో 10 మంది - పశ్చిమ గోదావరిలో 10 మంది - అనంతపురంలో 8 మంది - కడపలో 8 మంది - శ్రీకాకుళంలో 8 మంది - కర్నూలులో ఏడుగురు - తూర్పు గోదావరిలో ఆరుగురు - విశాఖపట్నంలో ఆరుగురు - కృష్ణా నలుగురు - నెల్లూరులో నలుగరు - విజయనగరంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక గడిచిన 24 గంటల్లో 9,097 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 2,27,860 పాజిటివ్ కేసులకు గాను 1,38,712 మంది డిశ్చార్జి కాగా.. 87,112 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 31,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ ఒక్క జిల్లాలోనే 224 మంది మృతి చెందారు.