ఒక్క రోజులో రాష్ట్రంలో 44..దేశంలో 6977!

Mon May 25 2020 14:20:50 GMT+0530 (IST)

New Dangerous Desease Spreads in Andhra

ఏపీలో మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది.  తాజాగా 44 మందికి వైరస్ సోకింది. గత 24 గంటల్లో 10240 శాంపిల్స్ ను పరీక్షించగా 44 మందికి కరోనా వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 2671కి చేరింది.  అలాగే 41 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో 1848 మంది డిశ్చార్జి కాగా 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అటు మొత్తం 56 మంది మరణించారు. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 45 మందికి కొత్తగా వైరస్ సోకింది.  అందులో కువైట్ నుంచి వచ్చిన వారు 41 మంది ఖతర్ నుంచి 3 - సౌదీ నుంచి ఒకరు ఉన్నారు. మొత్తం విదేశాల నుంచి వచ్చిన వారిలో 62 మందికి వైరస్ వచ్చింది.ఇకపోతే దేశంలో కూడా రోజురోజుకి మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.  దేశంలో గడిచిన 24 గంటల్లో 6977 వైరస్ కేసులు నమోదు కాగా - 154 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం పాజిటివ్  కేసుల సంఖ్య 138845కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57720 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 4021 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 77103 వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50వేలు దాటేసి... 50231కి చేరింది. నెక్ట్స్ తమిళనాడులో కేసుల సంఖ్య 16277కి చేరింది. గుజరాత్ కూడా అంతే. అక్కడ 14056 కేసులొచ్చాయి. తర్వాతున్నది ఢిల్లీయే. అక్కడ 13418 కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి... 90వేలకు పైగా కేసులున్నాయి. దీన్ని బట్టి చూస్తే ..ఈ నాలుగు రాష్ట్రాలపై కేంద్రం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.